Kalwakurthy: పండుగల సాయన్న విగ్రహం తొలగింపుపై ముదిరాజ్ సంఘం డిమాండ్
Kalwakurthy: లింగాలలో పండుగల సాయన్న విగ్రహం తొలగింపుపై కల్వకుర్తి తాలూకా ముదిరాజ్ సంఘం తీవ్ర ఆగ్రహం. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.
Kalwakurthy: పండుగల సాయన్న విగ్రహం తొలగింపుపై ముదిరాజ్ సంఘం డిమాండ్
కల్వకుర్తి: నాగర్ కర్నూల్ జిల్లా – అచ్చంపేట నియోజకవర్గం – లింగాల గ్రామంలో పండుగల సాయన్న విగ్రహాన్ని తొలగించిన ఘటనపై ముదిరాజ్ సంఘంలో, బీసీ కులలో,ప్రజల్లో తీవ్ర ఆవేదన నెలకొంది.ముదిరాజ్ ల,బీసీ కూలాల, మనోభావాలను గౌరవించి, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కల్వకుర్తి తాలూకా ముదిరాజ్ డిమాండ్ చెస్తుంది.
ఈ ఘటనకు సంబంధించి మా ప్రధాన డిమాండ్లు:
1. పండుగల సాయన్న విగ్రహాన్ని తొలగించిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి.
2. ప్రజల మనోభావాలను దెబ్బతీసిన ఈ ఘటనలో బాధ్యులుగా తేలిన అధికారులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి.
3. RTC DMపై సమగ్ర విచారణ జరిపి, విచారణలో బాధ్యత నిర్ధారణ అయితే చట్టప్రకారం సస్పెండ్ చేయాలి.
4. MLA ప్రకటించిన పండుగల సాయన్న చౌరస్తాలో పండుగల సాయన్న విగ్రహాన్ని గౌరవప్రదంగా ఏర్పాటు చేయాలి.
పండుగల సాయన్న ముదిరాజ్ గౌరవం, ప్రజల మనోభావాలు, సామాజిక న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతుంది. న్యాయం జరిగే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ మా పోరాటాన్ని ఆపేది లేదు.
కార్యక్రమంలో ముదిరాజ్ నాగర్ కర్నూలు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు చందు ముదిరాజ్, ముదిరాజ్ సంఘం తాలూకా ప్రధాన కార్యదర్శి పద్మ అనిల్ ముదిరాజ్. ముదిరాజ్ సంఘం నాయకులు మొక్తల శ్రీను ముదిరాజ్, బండారి శ్రీను ముదిరాజ్, మొగుళాలు ముదిరాజ్, బాలకృష్ణ ముదిరాజ్, యాదగిరి ముదిరాజ్ నాయకులు పాల్గొన్నారు.




