Kalwakurthy: నిందితుడి నుండి రూ.1.75 లక్షల దొంగతనం నగదు, డీవీఆర్ స్వాధీనం

Kalwakurthy: కల్వకుర్తి లోని మహాలక్ష్మి వైన్ షాప్ చోరీ కేసును సీఐ భీమ కుమార్, ఎస్ఐ కురుమూర్తిల బృందం 48 గంటల్లో ఛేదించి రూ.1.75 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 22 July 2026 11:54 PM IST
Kalwakurthy
X

Kalwakurthy: నిందితుడి నుండి రూ.1.75 లక్షల దొంగతనం నగదు, డీవీఆర్ స్వాధీనం

కల్వకుర్తి: కల్వకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యానగర్ కాలనీలో గల శ్రీ మహాలక్ష్మి వైన్ షాప్లో 19/20-07-2026 రాత్రి జరిగిన చోరీ కేసును కల్వకుర్తి పోలీసులు కేవలం రెండు రోజుల్లోనే ఛేదించారు.

నిందితుడు షాపు వెనుక గోడకు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించి, సీసీటీవీ కెమెరాల వైర్లను కత్తిరించి, నగదు రూ.1,75,000/- మరియు డీవీఆర్‌ను అపహరించి పరారయ్యాడు.దర్యాప్తు సందర్భంగా 22-07-2026న వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో సిమ్ముల మల్లికార్జున రెడ్డి @ చిన్న (32), గాంధీనగర్, కల్వకుర్తిను పోలీసులు అనుమానాస్పదంగా గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించగా, నేరాన్ని అంగీకరించాడు.నిందితుడి నుండి రూ.1,75,000/- నగదు, ఒక డీవీఆర్, నేరానికి ఉపయోగించిన సుత్తి మరియు కట్టింగ్ ప్లయర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసి గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరిచారు.

ఇట్టి కేసులో 48 గంటల లోపులో నేరస్థుని పట్టుకొని రీమాండ్ కి తరలించిన భీమ కుమార్ , CI- కల్వకుర్తి ఇందుకు సహకరించిన S.కురుమూర్తి , SIP- , మరియు సిబ్బంది 1. శ్రీ. B.చిరంజీవి, 2. MD.నజీరుద్దిన్ , SP Dr. Sangram singh Ji patil, IPS మరియు DSP శ్రీ. S.వెంకట్ రెడ్డి అబినందించారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story