Makthal: కర్ణాటక ఫలితాలు కాంగ్రెస్‌కు గుణపాఠం.. బీజేపీ!

Makthal: కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టని బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి విమర్శించారు.

B. NARENDER, MAKTHAL
Published on: 29 Oct 2026 11:18 AM IST
Makthal
X

Makthal: కర్ణాటక ఫలితాలు కాంగ్రెస్‌కు గుణపాఠం.. బీజేపీ!

Makthal: కర్ణాటకలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠమని బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకొని, ప్రజా సమస్యల పరిష్కారంపై కాంగ్రెస్ నాయకత్వం దృష్టి సారించాలని హితవు పలికారు.

కర్ణాటకలో జరిగిన నాలుగు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో బీజేపీ మూడు స్థానాలు, ఎన్డీఏ మిత్రపక్షమైన జేడీఎస్ ఒక స్థానంలో విజయం సాధించాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఫలితాలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని చాటి చెప్తున్నాయని వ్యాఖ్యానించారు.

ఉపాధ్యాయులు, పట్టభద్రుల వంటి విద్యావంతుల వర్గాలు తమ తీర్పు ద్వారా కాంగ్రెస్‌కు గట్టి గుణపాఠం చెప్పారని అన్నారు. ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కంటే ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టాలని సూచించారు.

ప్రజాస్వామ్యంలో ఎన్నికల ఫలితాలు ప్రజల అభిప్రాయానికి ప్రతిబింబమని, ప్రజల విశ్వాసాన్ని పొందేందుకు రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని డాక్టర్ బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL