Makthal: మక్తల్‌లో వాకిటి లలిత ఆధ్వర్యంలో వైభవంగా కార్తీక దీపోత్సవం!

Makthal: మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయ స్వామి ఆలయ కోనేరులో మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి వాకిటి లలిత ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం వైభవంగా జరిగింది.

B. NARENDER, MAKTHAL
Published on: 29 Nov 2026 7:11 AM IST
Makthal
X

Makthal: మక్తల్‌లో వాకిటి లలిత ఆధ్వర్యంలో వైభవంగా కార్తీక దీపోత్సవం!

Makthal: మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో కార్తీక మాస పవిత్రతను చాటుతూ మంత్రి వాకిటి శ్రీహరి గారి సతీమణి వాకిటి లలిత గారి ఆధ్వర్యంలో మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయ స్వామి ఆలయ కోనేరులో కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు.

లలిత గారి ప్రత్యేక చొరవతో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక వేడుకలో పెద్ద సంఖ్యలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని దీపాలు వెలిగించి భక్తిపారవశ్యంలో మునిగిపోయారు.

ఈ మహత్తర దీపోత్సవంతో పడమటి ఆంజనేయ స్వామి ఆలయ కోనేరు వేలాది దీపాల కాంతులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.ఈ సందర్బంగా వాకిటి లలిత గారు మాట్లాడుతూ కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో విశిష్టమైన స్థానం ఉందని,దీపం వెలిగించడం అనేది అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానజ్యోతిని వెలిగించడానికి ప్రతీకని తెలిపారు .

ఈ పవిత్రమైన ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని ఘనంగా నిర్వహించాలనే సంకల్పంతో లక్ష దీపోత్సవం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL