Kawkuntla: కౌకుంట్లలో స్మార్ట్ రేషన్ కార్డులు, చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జియంఆర్
Kawkuntla: కౌకుంట్లలో ఎమ్మెల్యే జియంఆర్ స్మార్ట్ రేషన్ కార్డులు, కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. రూ.57 కోట్ల అభివృద్ధి పనుల వివరాలు వెల్లడించారు.
Kawkuntla: కౌకుంట్లలో స్మార్ట్ రేషన్ కార్డులు, చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జియంఆర్
కౌకుంట్ల: కౌకుంట్ల మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో మండలానికి చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసి, రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసి, అర్హులైన రేషన్ కార్డు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను మరియు వేరుశనగ విత్తనాలను పంపిణీ చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం కౌకుంట్ల మండలాన్ని కేవలం పేరుకే మండల కేంద్రంగా ప్రకటించిందని, కనీసం మండల ప్రకటనను గెజిట్లో కూడా పొందుపరచలేదని, ఎమ్మార్వో కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, పోలీస్ స్టేషన్ వంటి కీలక ప్రభుత్వ కార్యాలయాలను సైతం ఏర్పాటు చేయలేదని అన్నారు.
గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ కార్యాలయాలకు అద్దెలు చెల్లించకపోవడంతో కార్యాలయాలకు తాళాలు వేసే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ప్రభుత్వ సేవల్లో ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ కార్యాలయాల అద్దెలను సైతం తమ ప్రభుత్వమే చెల్లించిందని స్పష్టం చేశారు. కౌకుంట్ల మండలంలో చేపట్టనున్న ప్రధాన అభివృద్ధి పనుల గురించి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు వివరించారు.
1. తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణం – రూ.11 కోట్ల 92 లక్షలు.
2. కౌకుంట్ల మండల సమీకృత కార్యాలయ సముదాయం (మండల కాంప్లెక్స్) – రూ.2 కోట్ల 50 లక్షలు
3. NH-44 నుంచి ఇస్రంపల్లి, పెద్ద మునగాలచేడ్ మీదుగా కౌకుంట్ల వరకు రహదారి, HLB నిర్మాణం – రూ.35 కోట్లు.
4. వెంకంపల్లి–రేకులంపల్లి మధ్య బ్రిడ్జి నిర్మాణం – రూ.1 కోటి 80 లక్షలు.
5. కౌకుంట్ల–రాచాల, ఇస్రాంపల్లి వద్ద బ్రిడ్జిల నిర్మాణం – రూ.5 కోట్ల 40 లక్షలు.
6. ముచ్చింతల నుంచి ఎర్నాల (ఫర్దిపూర్) గేట్ వరకు బ్రిడ్జి నిర్మాణం – రూ.40 కోట్ల రూపాయల నిధులు తీసుకురావడం జరిగిందని తెలియ చేశారు, అందులో కొన్నింటికి ఇప్పటికే శంకుస్థాపన చేశామని తెలిపారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో కౌకుంట్ల మండలంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించలేదని, మన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో మొదటి విడతలో కౌకుంట్ల మండలానికి 232 ఇండ్లు ఇవ్వడం జరిగిందని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి అండగా ఉంటూ మరోసారి దీవించాలని ఈ సందర్భంగా కోరిన జియంఆర్. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కిషన్ రావు,మండల అధ్యక్షుడు రాఘవేందర్ రెడ్డి, సర్పంచ్ నరేష్, మాజీ కురుమూర్తి దేవస్థానం చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.




