Makthal: రైతు బాగుపడితేనే రాష్ట్రం, దేశం బాగుపడుతుంది..కిసాన్ మోర్చా!
Makthal: రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లభిస్తుంటే ప్రభుత్వం అడ్డుకోవడం సరికాదని నారాయణపేట జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు వెంకట రాములు ముదిరాజ్ ఆరోపించారు.
Makthal: రైతు బాగుపడితేనే రాష్ట్రం, దేశం బాగుపడుతుంది..కిసాన్ మోర్చా!
Makthal: రైతు బాగుపడితేనే రాష్ట్రం బాగుపడు తుంది. రైతులకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీల కంటే రైతు తను పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర వస్తేనే రైతు లాభపడతాడని కిసాన్ మోర్చా నారాయణపేట జిల్లా అధ్యక్షులు వెంకట రాములు ముదిరాజ్, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జి బలరామిరెడ్డి, ఉపాధ్యక్షులు కర్ణ స్వామి అన్నారు.
రైతు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి తప్ప వారికి గిట్టుబాటు ధర లభిస్తుంటే అడ్డుకోవడం మంచిది కాదన్నారు. ఎల్ ని నో ప్రభావం కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని, కొంతమంది రైతులు తాము పండించిన ధాన్యాన్ని నేరుగా వ్యాపారులకు అమ్ముకుని గిట్టుబాటు ధర పొందుతుంటే ప్రభుత్వానికి ఎందుకు కడుపు మంట అని ప్రశ్నించారు.
కల్లాల వద్దకే వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేయడం ద్వారా రైతులకు మార్కెట్లో విధించే ఖర్చులన్నీ తప్పి క్వింటాలకు 4 వేల రూపాయల నుండి 5 వేల రూపాయల వరకు ధర రావడం వల్ల రైతుకు మేలు జరుగుతోందని, మార్కెట్ ఖర్చులన్నీ తొలగిపోయి రైతులకు ఎంతో కొంత లాభం జరుగుతోందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వ్యాపారస్తులను బెదిరించడం సమంజసం కాదన్నారు.
రైతు ప్రయోజనాల కంటే రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్న వ్యాపారులపై దాడులు చేయడమే ప్రభుత్వ లక్ష్యమా అని ప్రశ్నించారు. రైతులు ఎన్నో కష్టాలు నష్టాలను ఎదుర్కొని పంట పండిస్తారన్నారు.గతంలో అనేక రకాల పంటలు సాగు చేసి నష్టపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని, డబ్బులు చేసి పెట్టుబడులు పెట్టి ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని చివరకు పండించిన పంటకు గిట్టుబాటు ధర వస్తుందో రాజు తెలియని పరిస్థితి రైతులది అని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ప్రస్తుతం వరి ధాన్యానికి కొంతమేర మంచి ధర లభిస్తుందడంతో మిల్లర్లు ధాన్యం వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేస్తున్నారని, ఈ విధంగా రైతులకు గిట్టుబాటు ధర తీస్తుందన్నారు.దీంతో రైతుల్లో కొంత ఆశ చిగురించిందన్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత తమ కష్టానికి తగిన ప్రకటన దక్కుతుందనే ఆశ తో రైతులు సంతోషపడుతున్నారన్నారు.
కానీ ఇలాంటి సమయంలో ప్రభుత్వం మిల్లర్లు, బియ్యం వ్యాపారులపై తనిఖీలు దాడులు నిర్వహిస్తూ డిఎం కిచరయ్య ధరలపై విధిస్తున్నట్లు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వ చర్యల ప్రభావం ధాన్యం కొనుగోళ్లపై పడితే చివరకు నష్టపోయేది వ్యాపారులు కాదు రైతులే కదా అన్నారు. ఈ పరిణామాల రేపు ధాన్యం ధరలు తగ్గుముఖం పడుతున్నాయని ఆందోళన రైతుల్లో వ్యక్తం అవుతుందని వెంకట్రాములు అన్నారు.
రైతులకు రుణమాఫీ బోనట్లు ఇతర పథకాలు ప్రకటించడం కంటే రైతు పండించిన పంటకు మార్కెట్లో మంచి ధర లభించేలా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ లక్ష్యంగా ఉండాలని వెంకట్ రాములు అన్నారు. రైతులకు కొద్దిపాటి గిట్టుబాటు ధర వస్తున్న సమయంలో ఆ ధర నిలకడగా ఉండేలా చర్యలు తీసుకోవాల్సింది పోయి కొనుగోలు వ్యవస్థపై ప్రభావం చూపే చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
ప్రస్తుతం వర్షాలు లేక పోవడం మూలంగా ప్రాజెక్టులు చెరువులు కుంటలలో నీరు లేకపోవడం ఏ కాకుండా భూగర్భ జలాలు కూడా అంతరించిపోయాయి.అప్రకటిత విద్యుత్ కోతల మూలంగా బోరు బావులలో ఉన్న నీరు కూడా పంట పొలాలకు పెట్టలేకపోయి పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. దీని కారణంగా పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గిట్టుబాటు ధర కన్నా ఎక్కువ ధరను చెల్లించి రైతుల దగ్గరికి పక్క రాష్ట్రాల వ్యాపారస్తులు వచ్చి న్యాయమైన ధరలు చెల్లించి వడ్లు కొనుగోలు చేస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తెచ్చి పక్క రాష్ట్రాల నుంచి వచ్చే వ్యాపారస్తులపై ఒత్తిడి తెచ్చి ధరలు తగ్గించమని ప్రభుత్వం నిర్ణయించిన ధరకే కొనమని వారిపై ఒత్తిడి చేస్తున్నారు.
అసలే వర్షాలు లేక పంటలు ఎండిపోయి దిక్కుతోచనే స్థితిలో ఉన్న రైతులకు పక్క రాష్ట్రాల వ్యాపారస్తులు ధాన్యాన్ని కొనుగోలు చేయడం మూలంగా మంచి ధర వస్తుంటే ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రైతుల తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గత రెండు రోజులుగా బక్క రాష్ట్రాల వ్యాపారస్తులు రాకపోవడం వల్ల ధాన్యం ధర పూర్తిగా తగ్గిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన అన్నారు. ఇలాగే అధికారులు వ్యాపారస్తు లను వేధిస్తే రైతులకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ తరపున ,కిసాన్ మోర్చా తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.
ఈ విలేకరుల సమావేశంలో బిజెపి నారాయణపేట జిల్లా కార్యదర్శి కనకరాజు, మైనారిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి జావీద్ హుస్సేన్, ఓబీసీ మోర్చా నాయకులు సత్యనారాయణ లు ఉన్నారు.




