Anugonda: అనుగొండ దాహార్తి తీర్చిన కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి!
Anugonda: అనుగొండలో తాగునీటి సమస్యను తీర్చిన కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి, డీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి. సొంత నిధులతో హంద్రీ కాల్వ పూడికతీత పూర్తి!
Anugonda: అనుగొండ దాహార్తి తీర్చిన కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి!
అనుగొండ గ్రామ దాహార్తి తీర్చిన ఎమ్మెల్యే
కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం అనుగొండ గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే దస్తగిరి, కెడిసిసి బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి తమ సొంత నిధులు రూ.3 లక్షలతో హంద్రీ నది కాల్వ పూడికతీత పనులను పూర్తిచేశారు.ఈ సందర్భంగా హంద్రీ నదిలో గంగా జలానికి హారతి ఇచ్చి కాల్వ ద్వారా అనుగొండ గ్రామానికి నీటిని విడుదల చేశారు.ఎమ్మెల్యే దస్తగిరి మాట్లాడుతూ ప్రజా సంక్షేమే కూటమి ప్రభుత్వం ధ్యేయమన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో కోడుమూరు నియోజకవర్గంలో సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రామకృష్ణ రెడ్డి , రవీంద్ర గౌడ్, వర్కూరు గిడ్డయ్య,గ్రామ ప్రజలు , తదితరులు పాల్గొనారు.
Next Story




