Kosigi: పెళ్లి వేడుకలో డీజే వద్ద డాన్స్ చేస్తూ 17 ఏళ్ల యువకుడు మృతి

Kosigi: కోస్గి మండలం పోతిరెడ్డిపల్లిలో పెళ్లి వేడుకలో డీజే వద్ద డాన్స్ చేస్తూ 17 ఏళ్ల విద్యార్థి రవితేజ కుప్పకూలి మృతి చెందాడు. గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

AKRAM PASHA , KODANGAL
Published on: 2 Sept 2026 6:38 PM IST
Kosigi
X

Kosigi: పెళ్లి వేడుకలో డీజే వద్ద డాన్స్ చేస్తూ 17 ఏళ్ల యువకుడు మృతి

కోస్గి: పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఓ పెళ్లి వేడుకలో డీజే వద్ద డాన్స్ చేస్తూ 17 ఏళ్ల రవితేజ ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే స్నేహితులు అతడిని కోస్గి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.

మృతుడు పోతిరెడ్డిపల్లికి చెందిన లక్ష్మీ–దస్తయ్య దంపతుల కుమారుడు రవితేజ. రవితేజ కోస్గి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

చిన్న వయసులోనే రవితేజ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. యువకుడి ఆకస్మిక మృతితో పోతిరెడ్డిపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

AKRAM PASHA , KODANGAL

AKRAM PASHA , KODANGAL