Kothakota: కొత్తకోటలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి వసంతోత్సవ శోభాయాత్ర
Kothakota: కొత్తకోటలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి వసంతోత్సవ శోభాయాత్ర వైభవంగా సాగింది. భజనలు, బతుకమ్మలు, కోలాటాలతో మార్మోగిన పురవీధులు.
Kothakota: కొత్తకోటలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి వసంతోత్సవ శోభాయాత్ర
కొత్తకోట: పట్టణంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి వసంతోత్సవ శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. గత పది రోజులుగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో, దసరా పర్వదినం మరుసటి రోజు వసంతోత్సవాన్ని నిర్వహించడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది.
ఈ సంప్రదాయంలో భాగంగా ఆలయ నిర్వాహకులు అమ్మవారి వసంతోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై అమ్మవారి ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి, దేవాలయ ప్రాంగణం నుంచి శోభాయాత్రను ప్రారంభించారు. పట్టణంలోని ప్రధాన వీధులతో పాటు వివిధ పురవీధుల మీదుగా శోభాయాత్ర కొనసాగింది.
ఈ సందర్భంగా మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి పారవశ్యంతో సందడి చేశారు. భజనలు, బతుకమ్మలు, కోలాటాలు, దాండియా నృత్యాలతో పాటు డీజే సంగీతం, బాణసంచా వెలుగుల మధ్య శోభాయాత్ర కనులపండువగా సాగింది. ఆటపాటలతో పట్టణ పురవీధులు సందడిగా మారగా, భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వసంతోత్సవ శోభాయాత్రతో కొత్తకోట పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. తరతరాలుగా వస్తున్న ఆధ్యాత్మిక సంప్రదాయాలను కొనసాగిస్తూ, భక్తులందరినీ ఒక్కచోట చేర్చేలా ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కొత్తకోట పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు భీమ చంద్రకాంత్, గౌరవాధ్యక్షుడు భీమ ప్రభాకర్, శ్రీనివాసులు, శంకర్, భీమ కిషోర్, నరసింహమూర్తి , భాస్కర్ , జయలక్ష్మి, రాధిక, జ్యోతి, అనిత, స్వాతి తదితరులు పాల్గొని వసంతోత్సవ శోభాయాత్రను విజయవంతం చేశారు.




