Kothakota: కొత్తకోట స్టడీ సెంటర్లో ఉద్యోగార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ
Kothakota: కొత్తకోట స్టడీ సెంటర్లో పోలీస్ ఉద్యోగార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ. ఎమ్మెల్యే జీఎంఆర్ సోదరుడు జీబీఆర్ పంపిణీ. పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ అరుణ.
Kothakota: కొత్తకోట స్టడీ సెంటర్లో ఉద్యోగార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణీ
కొత్తకోట: కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలో రాఘవేంద్ర స్వామి ఆలయం సమీపంలోని స్టడీ సెంటర్లో కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు.
దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి. మధుసూదన్ రెడ్డి (GMR) ఆదేశాల మేరకు ఆయన సోదరుడు శ్రీ జి. భాస్కర్ రెడ్డి (GBR) విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. విద్యార్థులు పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అరుణ శ్రీనివాస్, వైస్ చైర్మన్ పల్లవి కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.




