Kothakota: కొత్తకోట వాసవి ఆలయంలో ఘనంగా చండీ హోమం!

Kothakota: కొత్తకోట శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో దుర్గాష్టమిని పురస్కరించుకుని సామూహిక చండీ హోమం, కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు.

B. KISHORE KUMAR, KOTTHAKOTA
Published on: 18 Oct 2026 6:12 PM IST
Kothakota
X

Kothakota: కొత్తకోట వాసవి ఆలయంలో ఘనంగా చండీ హోమం!

Kothakota: పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజైన ఆదివారం దుర్గాష్టమిని పురస్కరించుకొని అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు.

ఈ సందర్భంగా ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని సర్వమంగళ ప్రాప్తి కోసం భక్తులచే సామూహికంగా చండీ హోమం, త్రినాథస్వామి వ్రతం నిర్వహించారు. అనంతరం మహిళలచే సామూహిక కుంకుమార్చన, లలితా సహస్రనామ పారాయణం నిర్వహించారు.

ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పూజా కార్యక్రమాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరిగేలా కొత్తకోట పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు భీమా చంద్రకాంత్‌తో పాటు ఆలయ నిర్వాహకులు శ్రీనివాసులు, శంకర్, ప్రభాకర్, భీమా కిషోర్ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.

B. KISHORE KUMAR, KOTTHAKOTA

B. KISHORE KUMAR, KOTTHAKOTA