Kadtal: కడ్తాల్ మండల కేంద్రంలో ఘనంగా వినాయక నిమజ్జనం!
Kadtal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్లో సేవాలాల్ సేన ఆధ్వర్యంలో ఉత్సాహంగా వినాయక నిమజ్జనం. భక్తులకు అన్నదానం, ఆకట్టుకున్న లడ్డూల వేలం పాట.
Kadtal: కడ్తాల్ మండల కేంద్రంలో ఘనంగా వినాయక నిమజ్జనం!
Kadtal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో సేవాలాల్ సేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. యూనియన్ బ్యాంక్ సమీపంలో సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు, కడ్తాల్ మండల ఉప సర్పంచుల సంఘం అధ్యక్షులు జర్పుల లక్పతి నాయక్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గణేష్ లడ్డూ ప్రసాదం వేలం నిర్వహించగా భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
మొదటి లడ్డూను రాజశేఖర్ రెడ్డి (రాజబాబు) రూ.20,000లకు కైవసం చేసుకోగా, రెండో లడ్డూను జర్పుల వెంకటేష్ నాయక్ రూ.13,000లకు దక్కించుకున్నారు. కార్యక్రమంలో ఆమనగల్ మార్కెట్ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, మాజీ డీసీసీ ఉపాధ్యక్షులు భీక్య నాయక్, సర్పంచులు భిక్షపతి, సేవ్యా నాయక్, సేవాలాల్ సేన రంగారెడ్డి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజు నాయక్, కడ్తాల్ మండల అధ్యక్షులు, ఉప సర్పంచుల సంఘం కార్యదర్శి రమేష్ నాయక్, రేవంత్ మిత్రమండలి వ్యవస్థాపక అధ్యక్షులు చందోజీ, మాజీ ఉప సర్పంచ్ పాండు నాయక్, జిల్లా గిరిజన నాయకులు లక్ష్మణ్ నాయక్, వార్డు సభ్యులు నాగార్జున్, రాజు, కడ్తాల్ మండల సేవాలాల్ సేన యువజన అధ్యక్షులు తేజు నాయక్, సాధు సేవా సంఘం అధ్యక్షులు రాజు నాయక్, గణేష్ కమిటీ అధ్యక్షులు విఘ్నేష్ నాయక్, నాయకులు కడారి రమేష్, దేశ్య నాయక్, సక్రు, రాజేష్, కృష్ణకాంత్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.




