Nagarkurnool: కల్వకుర్తి ఎమ్మెల్యే నారాయణరెడ్డిని కలిసిన న్యాయవాదులు, ఆర్టీసీ నేతలు!

Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని కలిసిన బార్ అసోసియేషన్ న్యాయవాదులు, ఆర్టీసీ సంఘం నాయకులు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 28 Sept 2026 1:24 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: కల్వకుర్తి ఎమ్మెల్యే నారాయణరెడ్డిని కలిసిన న్యాయవాదులు, ఆర్టీసీ నేతలు!

Nagarkurnool: కల్వకుర్తి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో కల్వకుర్తి బార్ అసోసియేషన్ న్యాయవాదులు, ఆర్టీసీ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.

కల్వకుర్తికి అదనపు కోర్టు మంజూరు కావడం పట్ల ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని న్యాయవాదులు అభినందించి ఘనంగా సన్మానించారు. అదేవిధంగా కల్వకుర్తిలో నూతన కోర్టు భవన నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయించాలని కోరారు.

ఈ సందర్భంగా కోర్టు భవన నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.అనంతరం కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్‌కుమార్ ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో తెలంగాణ వర్కర్స్ యూనియన్ (టీడబ్ల్యూయూ) డిపో కార్యదర్శి రవీందర్, అధ్యక్షుడు శివ జగదీశ్వర్ తదితరులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు.

అక్టోబర్ 9న ఆర్టీసీలో నిర్వహించనున్న ఎన్నికలపై ఎమ్మెల్యేతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆర్టీసీ సంఘం నాయకులకు తన పూర్తి మద్దతు, సహకారం అందిస్తానని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సురేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కల్వకుర్తి మండల అధ్యక్షుడు బాల్‌రెడ్డి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లేష్, న్యాయవాదులు జమీల్, వెంకట్‌రెడ్డి, కృష్ణయ్య, భాస్కర్‌రెడ్డి, వెంకటరమణ, డిపో డ్రైవర్లు గిరిక రాములు, శ్రీనివాసులు, సదానందం, కండక్టర్లు భానుప్రకాష్, సంతోష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY