Devarakadra: లక్ష్మీపల్లి పాఠశాలలో విద్యార్థులకు ఉచిత యూనిఫాంల పంపిణీ!

Devarakadra: మహబూబ్‌నగర్ జిల్లా లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ఉచిత యూనిఫామ్‌లను సర్పంచ్ పెద్దమోని లక్ష్మీ ఆంజనేయులు పంపిణీ చేశారు.

GOKARANNA,  GADWAL
Published on: 10 Sept 2026 10:41 PM IST
Devarakadra
X

Devarakadra: లక్ష్మీపల్లి పాఠశాలలో విద్యార్థులకు ఉచిత యూనిఫాంల పంపిణీ!

దేవరకద్ర: విద్యార్థులు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరవుతూ క్రమశిక్షణతో చదువుకుంటేనే బంగారు భవిష్యత్తు ఉంటుందని దేవరకద్ర మండలం లక్ష్మీ పల్లి గ్రామ సర్పంచ్ పెద్ద మోని లక్ష్మీ ఆంజనేయులు అన్నారు. దేవరకద్ర మండలం లక్ష్మీ పల్లి ప్రాథమిక పాఠశాల లో గురువారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన ఏకరూప దుస్తులను విద్యార్థులకు పంపిణీ చేశారు.

ఈ సందర్బంగా పాఠశాల హెచ్ఎం కల్పన అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో సర్పంచ్ లక్ష్మీ ఆంజనేయులు ముఖ్య అతిథి గా హాజరై మాట్లాడుతూ విద్యా ర్థులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకోవాలని కోరారు. ప్రభు త్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య నందించేందుకు ప్రభుత్వ ప రంగా అన్ని విధాలా కృషి చేస్తున్నట్లు తెలిపారు.

విద్యార్థులకు గుణాత్మకమైన విద్యతో పాటు అక్షయపాత్ర ద్వారా మంచి పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు. పాఠ్య పుస్తకాలు, రాత పుస్తకాలు, రెండు జతల ఏకరూప దుస్తులు, బూట్లు, బెల్టు లు సైతం ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా

పాఠశాలలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోని విద్యలో మరింతగా రాణించాలని కోరారు. పాఠశాల ఉపాధ్యాయులు లయన్ అశ్విని చంద్రశేఖర్ మాట్లాడుతూ

విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై విద్యాబుద్ధులు నేర్చుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు. కార్యక్రమంలో గ్రామ పెద్ద లు వెంకటేశ్వర్ రెడ్డి, పెద్ద మోని ఆంజనేయులు,ఎ.నాగేశ్వర్ రెడ్డి , సాయిలు, చంద్రమ్మ, హెచ్ యం కల్పన, ఉపాధ్యాయులు అశ్విని చంద్ర శేఖర్, విజయ లక్ష్మీ, నాగేశ్వర్ రెడ్డి,వెంకట్రాములు తదితరులు పాల్గొన్నారు.

GOKARANNA,  GADWAL

GOKARANNA, GADWAL

Next Story