Pebberu: తెలంగాణకు మోదీ రాక.. పెబ్బేరులో బీజేపీ శ్రేణుల భారీ స్కెచ్!
Pebberu: ఈ నెల 10న ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనను విజయవంతం చేయాలని వనపర్తి జిల్లా పెబ్బేరులో బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు.
Pebberu: తెలంగాణకు మోదీ రాక.. పెబ్బేరులో బీజేపీ శ్రేణుల భారీ స్కెచ్!
పెబ్బేరు: వనపర్తి జిల్లా పెబ్బేరు ప్రెస్ క్లబ్‌లో బీజేపీ నాయకులు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నెల 10వ తేదీ ఆదివారం దేశ ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో సభను విజయవంతం చేయాలని బీజేపీ కార్యకర్తలు, హిందూ నాయకులు, మోడీ అభిమానులకు పిలుపునిచ్చారు. మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయంతో దేశవ్యాప్తంగా పార్టీకి ప్రజాదారణ పెరిగిందని, తెలంగాణలో కూడా రాజకీయ మార్పులకు నాంది పలికే సభ ఇదేనని నాయకులు పేర్కొన్నారు.
తెలంగాణలో వచ్చే ప్రభుత్వం కూడా బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ హిందూ దేవుళ్లపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, ఆమె వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. సీఎం తక్షణమే ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రధాని మోడీ నాయకత్వంలో తెలంగాణకు వేల కోట్ల రూపాయల అభివృద్ధి నిధులు వచ్చాయని, ముఖ్యంగా రాష్ట్ర నుంచి వచ్చే ప్రతి పథకంలో, జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయించిందని గుర్తుచేశారు. దేశవ్యాప్తంగా ప్రజలు మోడీకి బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు.
ఈ సభకు వనపర్తి జిల్లా నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు, రైలు సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొని మోడీ సభను విజయవంతం చేయాలని బీజేపీ కార్యవర్గ సభ్యుడు పురుషోత్తం రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వేమారెడ్డి, కంచె ఆంజనేయులు, రాఘవేందర్ గౌడ్, రామకృష్ణ, శివ, టౌన్ అధ్యక్షుడు క్రాంతి కుమార్, సర్వేష్, గొనెల.అరవింద్, కార్తీక్, మోతే రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.




