Amanagallu: సర్పంచ్ రాజేశ్వరి మల్లేష్ ఆధ్వర్యంలో గ్రంథాలయ భవనానికి భూమి పూజ

Amanagallu: మేడిగడ్డ తాండలో రూ. 2 లక్షల సీఎస్‌ఆర్ నిధులతో గ్రంథాలయ భవన నిర్మాణానికి సర్పంచ్ రాజేశ్వరి మల్లేష్, ఉపసర్పంచ్ విజయ్ రాథోడ్ భూమి పూజ చేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 29 Aug 2026 10:51 AM IST
Amanagallu
X

Amanagallu: సర్పంచ్ రాజేశ్వరి మల్లేష్ ఆధ్వర్యంలో గ్రంథాలయ భవనానికి భూమి పూజ

Amanagallu: అమనగల్లు మండలం మేడిగడ్డ తాండ గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించనున్న గ్రంథాలయ భవనానికి శనివారం భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో సి.ఎస్.ఆర్. నిధుల నుంచి రూ.2 లక్షలు మంజూరు కావడంతో గ్రంథాలయ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

స్థానిక సర్పంచ్ రాజేశ్వరి మల్లేష్, ఉప సర్పంచ్ విజయ్ రాథోడ్ వార్డు సభ్యులతో కలిసి భూమి పూజ నిర్వహించారు. గ్రామంలో విద్యార్థులు, యువత మరియు పుస్తక ప్రియులకు గ్రంథాలయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు మల్లేష్, దేవేందర్, సీతారాం, జయందర్, కవిత మణిపాల్ తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story