Makthal: మక్తల్ కోర్టుకు రెగ్యులర్ జడ్జి రాక ఎన్నో ఏళ్ల కల సాకారం

Makthal: నారాయణపేట జిల్లా మక్తల్ కోర్టుకు రెగ్యులర్ జడ్జిగా కాసర్ల అవినాష్ నియామకం కావడంతో న్యాయవాదులు ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు.

B. NARENDER, MAKTHAL
Published on: 12 Nov 2026 6:41 PM IST
Makthal
X

Makthal: మక్తల్ కోర్టుకు రెగ్యులర్ జడ్జి రాక ఎన్నో ఏళ్ల కల సాకారం

నారాయణ పేట్ జిల్లా: మక్తల్ కోర్టుకు రెగ్యులర్ జడ్జిగా కాసర్ల అవినాష్ నియామకం కావడంతో... మక్తల్ న్యాయవాదులు ఆయనకు గురువారం ఘనంగా స్వాగతం పలికారు. మక్తల్ కోర్టు అడ్ హక్ కమిటీ అధ్యక్షుడు తిమ్మన్న పూల బొకే ఇచ్చి జడ్జికి స్వాగతం పలికారు. అనంతరం మక్తల్ న్యాయవాదులు, నారాయణపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జడ్జి అవినాష్ ను శాలువాతో సత్కరించి మెమొంటో అందజేశారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ... మక్తల్ రెగ్యులర్ రావడంతో చుట్టుపక్కల దాదాపు 50 పైగా గ్రామాల ప్రజల ఇబ్బందులు దూరమయ్యాయని హర్షం వ్యక్తం చేశారు. నారాయణపేట తో పోల్చితే మక్తల్ లోనే కేసులు ఎక్కువ అని, రెగ్యులర్ జడ్జి రాకతో కేసుల పరిష్కారం మరింత వేగవంతం కానుందని తెలిపారు. కార్యక్రమంలో మక్తల్ న్యాయవాదులు, నారాయణపేట బార్ అసోసియేషన్ న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL