Devarakadra: దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సేవా దృక్పథం

Devarakadra: దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి దివ్యాంగులకు స్కూటీలు, ట్రై సైకిళ్లు పంపిణీ చేశారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 27 April 2026 8:49 PM IST
Devarakadra
X

Devarakadra: దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి సేవా దృక్పథం

Devarakadra: దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, దివ్యాంగులు సమాజంలో మంచిగా ఎదగాలని ఆకాంక్షించిన దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. సోమవారం దేవరకద్ర మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వికలాంగులకు స్కూటీలు, ట్రై సైకిల్స్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ వికలాంగుల సంక్షేమం ప్రభుత్వం ప్రధాన లక్ష్యం, వారికి అవసరమైన సదుపాయాలను అందించడం ద్వారా స్వలంబన సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

ఈ పరికరాలు వికలాంగుల రోజువారి జీవితాన్ని సులభతరం చేస్తాయని,వారి జీవనోపాధికి తోడ్పడతాయని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి మరియు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన దివ్యాంగులు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దమయంతి గోవర్ధన్ రెడ్డి, వైస్ చైర్మన్ యుగంధర్ రెడ్డి,ఆర్గనైజింగ్ సెక్రటరీ అరవింద్ కుమార్ రెడ్డి, కౌకుంట్ల మండల అధ్యక్షులు రాఘవేందర్ రెడ్డి, అంజన్ కుమార్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కథలప్ప, రాచాల యుగంధర్, వివిధ గ్రామాల అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

Next Story