Makthal: నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభలకు తరలివెళ్లిన మాగనూరు నాయకులు!

Makthal: మక్తల్ నియోజకవర్గం మాగనూరు మండలం నుండి అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభల బహిరంగ సభకు నాయకులు నల్లగొండకు తరలివెళ్లారు.

B. NARENDER, MAKTHAL
Published on: 15 Nov 2026 2:26 PM IST
Makthal
X

Makthal: నల్లగొండ రైతు సంఘం జాతీయ మహాసభలకు తరలివెళ్లిన మాగనూరు నాయకులు!

Makthal: మక్తల్ నియోజకవర్గం మాగనూరు మండలం నుండి నల్లగొండలో జరుగు రైతు సంఘం జాతీయ మహాసభలసందర్భంగా మొదటి రోజు బహిరంగ సభకు తరలి వెళ్లిన నాయకులు కార్యక్రమాన్ని ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పుంజనూర్ ఆంజనేయులు, సిఐటియు జిల్లా నాయకులు భరత్ కుమార్ మాట్లాడుతూ అఖిల భారత కిసాన్‌ సభ 36వ జాతీయ మహాసభలు ఈ నెల 15 నుంచి 18 వరకు నల్లగొండలో జరుగుతున్నాయి.

1936 ఏప్రిల్‌ 11న లక్నోలో అఖిల భారత కిసాన్‌ సభ ఏర్పాటై 2026 నాటికి 90 ఏండ్లు పూర్తయ్యాయి. అదేవిధంగా 1946 జూలై 4న ప్రారంభమైన చారిత్రాత్మక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి కూడా 80 ఏండ్లు పూర్తయింది. ఆ చారిత్రక పోరాటానికి ప్రధాన కేంద్రాల్లో ఒకటైన నల్లగొండలో 36వ జాతీయ మహాసభలు నిర్వహించాలని నిర్ణయించడం ఈ మహాసభలకు ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించిపెట్టింది.

దేశవ్యాప్తంగా సాగుతున్న రైతాంగ పోరాటాలను ఐక్యం చేయడం ద్వారానే అఖిల భారత కిసాన్‌ సభ ఏర్పడింది. ఆవిర్భావం నుంచి ఈ వారసత్వాన్ని కొనసాగిస్తూ దేశవ్యాప్తంగా అనేక చారిత్రక, విజయవంతమైన రైతాంగ పోరాటాలకు నాయకత్వం వహించింది.

1991లో ప్రారంభమైన ఆర్థిక సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ విధానాల ఫలితంగా గత 35 ఏండ్ల్లలో కొత్త, తీవ్రమైన సవాళ్లు ఎదురయ్యాయి. భారత్‌తోపాటు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలపై అసమానమైన ప్రపంచ వాణిజ్య సంస్థ ఒప్పందాలు, పెరుగుతున్న వ్యవసాయ పెట్టుబడి ఖర్చులు, పంటలకు గిట్టుబాటు ధరలు లభించకపోవడం, సంస్థాగత రుణాల సంక్షోభం ఈ కాలంలో తీవ్రమయ్యాయి. సంస్థాగత రుణాల్లో అధిక భాగం శక్తివంతమైన కార్పొరేట్‌ సంస్థల వైపు మళ్లింది.

అన్ని రంగాల్లో కార్పొరేట్‌ కంపెనీలు వేగంగా విస్తరించాయి. 2014 తర్వాత మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కార్‌ రైతులు, కార్మిక వర్గ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మరింత తీవ్రమైన సవాళ్లను సృష్టించింది. సామ్రాజ్యవాదులు, కార్పొరేట్‌ సంస్థల ప్రయోజనాలను ప్రోత్సహించింది.

తీవ్రమైన వ్యవసాయ సంక్షోభం తలెత్తింది. ఫలితంగా గత మూడు దశాబ్దాల్లో 4 లక్షలకు పైగా రైతుల ఆత్మహత్యలకు కారణమైంది. వీరిలో లక్ష మందికి పైగా మోదీ నాయకత్వంలోని బీజేపీ పాలనలోనే ఆత్మహత్య చేసుకున్నారు. పేదరికం, నిరుద్యోగం, ఆకలి బాధలు తీవ్రంగా పెరిగాయి.

అదే సమయంలో ఆదానీ, అంబానీ వంటి కొద్దిమంది కార్పొరేట్‌ సంపన్నుల ఆదాయం, సంపద విపరీతంగా పెరిగాయి. 2025 ప్రపంచ ఆకలి సూచికలో 123 దేశాల్లో భారత్‌ 102వ స్థానంలో నిలిచింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో ఏర్పడ్డ ఎల్ నియో ప్రభావంతో నష్టపోయిన రైతంగాని ఆదుకోవాలని మాట్లాడడం జరిగింది.

ఈ కార్యక్రమంలో బ్యాగరీ నర్సింలు ఏం అశోక్ కొత్తపల్లి భూమానందు వడ్డే రాజు శంకరప్ప ఆంజనేయులు నేరేటి నర్సింలు కుమ్మరి మారెప్ప బోల్లబోడి దేవప్ప గుంజూరు తాయప్ప వాకిటి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL