Mahabubnagar: రాహుల్, ప్రియాంక అరెస్టుకు నిరసనగా మహబూబ్‌నగర్‌లో ధర్నా

Mahabubnagar: రాహుల్, ప్రియాంక గాంధీల అక్రమ అరెస్టు, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తొలగింపును డిమాండ్ చేస్తూ మహబూబ్‌నగర్ తెలంగాణ చౌరస్తాలో కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించారు.

NARENDRA CHARY,  Sr. Staff Reporter -MAHABOOBNAGAR
Updated on: 8 Oct 2026 5:57 PM IST
Mahabubnagar
X

Mahabubnagar: రాహుల్, ప్రియాంక అరెస్టుకు నిరసనగా మహబూబ్‌నగర్‌లో ధర్నా

Mahabubnagar: సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ ను తొలగించాలని పోరాటం చేస్తున్న రాహుల్, ప్రియాంక గాంధీల అరెస్టుకు నిరసనగా మహబూబ్‌నగర్ లో కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ అరెస్టుకు నిరసనగా, అలాగే సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ తొలగించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.

డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ధర్నాలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ను విధుల నుంచి తొలగించి,ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ మాట్లాడుతూ...ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్నీ తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ను మోదీ ప్రభుత్వం వెంటనే విధుల నుంచి తొలగించాలని...లేదంటే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని అన్నారు.

NARENDRA CHARY,  Sr. Staff Reporter -MAHABOOBNAGAR

NARENDRA CHARY, Sr. Staff Reporter -MAHABOOBNAGAR

రెండున్నర దశాబ్దాలకు పైగా క్షేత్రస్థాయి అనుభవంతో, మహబూబ్‌నగర్ జిల్లా సామాజిక, రాజకీయ పరిణామాలపై నిరంతరం కథనాలు అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.