Devarakadra: స్నేహితుడి కూతురి పెళ్లికి పూర్వ విద్యార్థుల రూ. 25 వేల ఆర్థిక సాయం!

Devarakadra: దేవరకద్ర 1998-99 పదో తరగతి పూర్వ విద్యార్థుల ఉదారత. స్నేహితుడు మ్యాదరి ఆంజనేయుల కూతురి పెళ్లికి రూ. 25 వేల ఆర్థిక సాయం అందజేత.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 26 Aug 2026 5:31 PM IST
Devarakadra
X

Devarakadra: స్నేహితుడి కూతురి పెళ్లికి పూర్వ విద్యార్థుల రూ. 25 వేల ఆర్థిక సాయం!

Devarakadra: తన స్నేహితుడు ఆడ కూతురు పెళ్లి చేసేందుకు పడుతున్న కష్టాన్ని చూసి పూర్వ విద్యార్థులు తమ వంతు సాయం అందించి అండగా నిలిచారు. దేవరకద్ర బాలుర పాఠశాలలో 1998 -1999 ఏడాదిలో పదో తరగతి పూర్తి చేసిన పూర్వ విద్యార్థులు దేవరకద్ర మండలం డోకూర్ గ్రామానికి చెందిన మ్యాదరి ఆంజనేయులు జ్యోతి దంపతుల కూతురు అనిత వివాహం కుదిరింది.

ఆంజనేయులు జ్యోతి దంపతులు కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడంతో పూర్వ విద్యార్థులు తమ వంతు సహాయంగా రూ.25వేల నగదును అందించి అండగా నిలిచారు. స్నేహితుడి కూతురి పెళ్లికి ఖర్చుల నిమిత్తం సాయం అందించినట్లు పూర్వ విద్యార్థులు పేర్కొన్నారు. పెళ్లికి సాయం చేయడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సతీష్ వెంకటేశ్వర్ రెడ్డి రాజు జయరాజు వెంకటేష్ రమేష్ కురుమూర్తి పాల్గొన్నారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

Next Story