Devarakadra: దేవరకద్రలో దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ!

Devarakadra: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం గోప్లాపూర్‌లో పశువైద్య శాఖ ఆధ్వర్యంలో దూడలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. డాక్టర్ ప్రవీణ్ వివరాలు వెల్లడించారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 4 Nov 2026 11:50 PM IST
Devarakadra
X

Devarakadra: దేవరకద్రలో దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ!

దేవరకద్ర: మహబూబ్‌నగర్ జిల్లా, దేవరకద్ర మండలంలోని గోప్లాపూర్ గ్రామంలో పశువైద్య శాఖ ఆధ్వర్యంలో దూడలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గోప్లాపూర్‌తో పాటు గుడిబండ, కోయిల్‌సాగర్ గ్రామాల్లో కూడా దూడలకు నట్టల నివారణ మందులు అందజేశారు.

దూడల్లో నట్టల నివారణ చేయడం వల్ల వాటి ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు, ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. నట్టల వల్ల కలిగే పోషకాహార లోపం, రక్తహీనత, బరువు తగ్గడం, జీర్ణ సంబంధిత సమస్యలను నివారించవచ్చు. పశువుల రోగనిరోధక శక్తి పెంపొందించడంలో కూడా నట్టల నివారణ కీలక పాత్ర పోషిస్తుంది.

కావున పశుపోషకులు తమ దూడలకు పశువైద్యుల సూచనల మేరకు క్రమం తప్పకుండా నట్టల నివారణ మందులు వేయించి, పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పశువైద్య శాఖ సూచించింది. పశువుల ఆరోగ్యమే పశుసంపద అభివృద్ధికి పునాది. ఈ కార్యక్రమం లో మండల పశు వైద్య అధికారి డా కె ప్రవీణ్, త్రివేణి – (LSA), పి. రఘు – ఆఫీస్ సబార్డినేట్, శంకరయ్య – వెటర్నరీ అసిస్టెంట్ పాల్గొన్నారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA