Mahabubnagar: వెంకటాయపల్లిలో నిత్యావసర సరుకుల కిట్ల పంపిణీ!

Mahabubnagar: దేవరకద్ర మండలం వెంకటాయపల్లిలో గూంజ్ సంస్థ ఆధ్వర్యంలో యాదవ (కుర్వ) సంఘం సభ్యులకు సర్పంచ్ రామాంజనేయులు నిత్యావసర సరుకుల కిట్లను పంపిణీ చేశారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 2 Nov 2026 9:48 PM IST
Mahabubnagar
X

Mahabubnagar: వెంకటాయపల్లిలో నిత్యావసర సరుకుల కిట్ల పంపిణీ!

మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటాయపల్లి గ్రామంలో గూంజ్ సంస్థ ఆధ్వర్యంలో యాదవ సంఘం (కుర్వ) సభ్యులకు కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.గ్రామ సర్పంచ్ సక్కేరి రామాంజనేయులు ముఖ్య అతిగా హాజరై నిత్యవసర కిట్లను యాదవ సంఘం (కుర్వ) సభ్యులకు పంపిణీ చేశారు. అనంతరం సంఘం పెద్దలు, నిర్వాహకులను శాలువాలతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా సేవా కార్యక్రమాల ద్వారా సమాజ అభివృద్ధికి తోడ్పడటంతో పాటు, గ్రామంలోని ప్రతి సంఘానికి అండగా నిలవడమే తమ లక్ష్యమని నిర్వాహకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కుర్వ సంఘం అధ్యక్షుడు శివ, ఉపసర్పంచ్ పింజరి మోహన్, గ్రామ పంచాయతీ కార్యదర్శి రాంమోహన్ గౌడ్,వార్డు సభ్యుడు పింజరి మల్లికార్జున్, పెద్ద కుర్వ రాములు,శేఖరప్ప, సంకటి శేఖర్,ఎల్లప్ప,కొత్తుపరి ఆంజనేయులు,గోవర్ధన్ రెడ్డి, బంగారి కాశన్న,బండ్రవల్లి సుధాకర్,మల్లికార్జున్,సాగర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA