Mahabubnagar: బ్రహ్మోస్ భూముల పరిహారం పెంచాలని కలెక్టర్‌కు వినతి!

Mahabubnagar: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల రైతులు బ్రహ్మోస్ భూముల పరిహారం పెంచాలని కలెక్టర్ కుష్బూ గుప్తాకు వినతిపత్రం అందజేశారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 1 Oct 2026 11:22 AM IST
Mahabubnagar
X

Mahabubnagar: బ్రహ్మోస్ భూముల పరిహారం పెంచాలని కలెక్టర్‌కు వినతి!

Mahabubnagar: దేవరకద్ర మండలం చౌదర్పల్లి, జిన్గురాల, బస్వాయిపల్లి గ్రామ రైతుల భూములు బ్రహ్మోస్ క్షిపణి తయారీ పరిశ్రమకు సేకరిస్తున్నందున భూముల పరిహారాన్ని పెంచి ఇవ్వాలంటూ ఆ మూడు గ్రామాల రైతులు జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ, మా గ్రామాలలో పరిశ్రమ వస్తున్నందుకు మా గ్రామ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి అన్న సంతోషం ఉంది, కానీ మా సాగు భూములు కోల్పోతున్నందుకు బాధ కూడా ఉందని తెలిపారు. అయినా కూడా ప్రభుత్వానికి సహకరిస్తామని కాకపోతే కొడంగల్ లో రైతులకు పరిహారం పెంచి ఇచ్చారు,

మాకు కూడా పరిహారాన్ని 20 లక్షల నుంచి 30 లక్షలకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు. అదేవిధంగా భూములు కోల్పోయిన రైతులకు పరిశ్రమలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చౌదర్పల్లి, జీనుగురాల ,బస్వాయపల్లి గ్రామ రైతులు పాల్గొన్నారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA