Devarakadra: మహబూబ్‌నగర్ ప్రజావాణిలో పీఏసీఎస్ చైర్మన్లు, రైతుల వినతి!
Devarakadra: పీఏసీఎస్ పాలకవర్గాలను నామినేషన్ ద్వారా కాకుండా ఎన్నికల ద్వారానే ఎన్నుకోవాలని మహబూబ్‌నగర్ ప్రజావాణిలో రైతుల వినతి.
Devarakadra: మహబూబ్‌నగర్ ప్రజావాణిలో పీఏసీఎస్ చైర్మన్లు, రైతుల వినతి!
Devarakadra: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం కలెక్టర్ కార్యాలయంలో మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని వివిధ PACS లలో సభ్యులుగా ఉన్న రైతులు రాష్ట్రంలో ఉన్న 908 PACS ల పదవి కాలం ముగిసిన ఏడాదికి పైగా గడిచింది ఇప్పటికే రెండుసార్లు పొడిగించారు ప్రస్తుతం ఉన్న పాలకవర్గాలను తొలగించి నామినేషన్ పద్ధతి ద్వారా నూతన పాలకవర్గాలను నియమించేందుకు సిద్ధమవుతుంది.
1964 లోని సెక్షన్ 115D 3 నుండి ప్రకారం స్వయం ప్రతిపత్తి కలిగిన PACS నకు ఎన్నికల ప్రక్రియ ద్వారా కాకుండా రైతుల సమ్మతి లేకుండా నామినేషన్ పద్ధతిలో పాలకవర్గాలను నియమించడమంటే సహకార వ్యవస్థను నిర్వీర్యం చేయడమే, కావున వెంటనే నామినేషన్ల ప్రక్రియను నిలిపివేయాలని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 908 PACS లకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించేలా చూడాలని ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో PASC చైర్మన్ లు నరేందర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మరియు బస్వాపూర్ మాజీ సర్పంచ్ హనుమంతు డోకూరు ఉప సర్పంచ్ లక్ష్మణ్ మన్యం రైతులు తదితరులు పాల్గొన్నారు.




