Mahabubnagar: ఆరోగ్య కేంద్రం, మెప్మా భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే యెన్నం!
Mahabubnagar: మహబూబ్‌నగర్‌లో మున్సిపల్ ఆరోగ్య కేంద్రం, మెప్మా భవనాన్ని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. మహిళలకు దసరా చీరలు పంపిణీ చేశారు.
Mahabubnagar: ఆరోగ్య కేంద్రం, మెప్మా భవనం ప్రారంభించిన ఎమ్మెల్యే యెన్నం!
మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ముడా (MUDA) మరియు మున్సిపల్ నిధులు రూ. 45 లక్షలతో ఏర్పాటు చేసిన నూతన హెల్త్ సెంటర్ ను, మరియు రూ. 25 లక్షలతో నిర్మించిన మెప్మా అదనపు భవనాన్ని ఎమ్మెల్యే, యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు ప్రారంభించారు.రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ఆరోగ్య కేంద్రాన్ని పట్టణ కేంద్రంలోని ప్రారంభించడం సంతోషకరం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం 'ఆరోగ్య తెలంగాణ' నిర్మాణమే ధ్యేయంగా పనిచేస్తోందని తెలిపారు. మున్సిపల్ సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు ఈ ఉచిత వైద్య సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అలాగే, మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా మహబూబ్‌నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో ఉచిత నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. యువత, మహిళలు ఈ అవకాశాలను ఉపయోగించుకుని మెరుగైన ఉపాధి అవకాశాలను పొందాలని పిలుపునిచ్చారు. దసరా పండుగను పురస్కరించుకుని మహిళా సంఘాల సభ్యులకు తన సొంత ఖర్చులతో చీరలను పంపిణీ చేశారు. నియోజకవర్గంలో సంక్షేమం, అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.




