Mahabubnagar: మహబూబ్‌నగర్ ఎన్టీఆర్ కాలేజీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Mahabubnagar: మహబూబ్‌నగర్ ఎన్టీఆర్ డిగ్రీ కాలేజీలో ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ విప్ యెన్నం, ఎమ్మెల్సీ బల్మూరి పాల్గొన్నారు.

NARENDRA CHARY,  Sr. Staff Reporter -MAHABOOBNAGAR
Updated on: 8 Oct 2026 5:56 PM IST
Mahabubnagar
X

Mahabubnagar: మహబూబ్‌నగర్ ఎన్టీఆర్ కాలేజీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Mahabubnagar: మహబూబ్ నగర్ లో ముందస్తుగానే బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటాయి. జిల్లా కేంద్రంలోనీ ఎన్టీఆర్ డిగ్రీ కాలేజీలో ఎన్ఎస్ యూ ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకలకు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, పీసీసీ ప్రధాన కార్యదర్శి మిథున్ రెడ్డి,డీసీసీ అధ్యక్షుడు సంజీవ్,యూత్ కాంగ్రెస్ నేతలు ముఖ్య అతిధులుగా హాజరై బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు.

ఆనంతరం వారంతా తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయం ఉట్టిపడేలా బతుకమ్మ డీజే పాటలకు కాలేజీ విద్యార్థినులతో కలిసి బతుకమ్మ ఆడారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.... దసరా పండుగకు ముందు ఎంతో వైభోగంగా కాలేజీ విద్యార్థినులతో కలిసి ఈ బతుకమ్మ సంబరాలను నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.విద్యార్థులు చదువుతో పాటు, ఇలాంటి సాంసృతిక కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొని విద్యారులను, నిర్వాహకులను అభినందిస్తున్నామన్నారు.

NARENDRA CHARY,  Sr. Staff Reporter -MAHABOOBNAGAR

NARENDRA CHARY, Sr. Staff Reporter -MAHABOOBNAGAR

రెండున్నర దశాబ్దాలకు పైగా క్షేత్రస్థాయి అనుభవంతో, మహబూబ్‌నగర్ జిల్లా సామాజిక, రాజకీయ పరిణామాలపై నిరంతరం కథనాలు అందిస్తున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.