Mahabubnagar: మహబూబ్‌నగర్‌లో పండుగ సాయన్న జయంతి: ఎస్పీ నివాళి
Mahabubnagar: మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో తెలంగాణ రాబిన్‌హుడ్ పండుగ సాయన్న జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ డి.జానకి ఘనంగా నివాళులర్పించారు.
Mahabubnagar: మహబూబ్‌నగర్‌లో పండుగ సాయన్న జయంతి: ఎస్పీ నివాళి
మహబూబ్‌నగర్ జిల్లా: తెలంగాణ రాబిన్‌హుడ్‌గా పేరుగాంచిన పండుగ సాయన్న జయంతి సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా ఎస్పీ డి.జానకి.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పండుగ సాయన్న ప్రస్తుత మహబూబ్‌నగర్ జిల్లాలోని నవాబ్‌పేట మండలం మెరుగోనిపల్లి గ్రామంలో జన్మించిన పాలమూరు ముద్దుబిడ్డ అని పేర్కొన్నారు. పేదలు, అణగారిన వర్గాల ప్రజల పక్షాన నిలిచి, దోపిడీ, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడిన ప్రజా వీరుడిగా ఆయన ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని తెలిపారు.
సంపన్నుల నుంచి సంపదను సేకరించి పేదలకు పంచిపెట్టిన వ్యక్తిగా ఆయనకు తెలంగాణ రాబిన్‌హుడ్ అనే పేరు వచ్చిందన్నారు. సొంత ప్రాంతమైన పాలమూరు జిల్లాకు చెందిన ఇలాంటి మహనీయుల చరిత్రను భావితరాలకు తెలియజేయడం, వారి ఆశయాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. పేదల సంక్షేమం, సామాజిక న్యాయం పట్ల ఆయన చూపిన నిబద్ధత నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, ఏఓ రుక్మిణి భాయ్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ మోతిరామ్, ఆర్‌ఐ అడ్మిన్ కృష్ణయ్య, ఆర్‌ఎస్‌ఐలు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




