Makthal: మక్తల్‌లో ఘనంగా పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు!
Makthal: నారాయణపేట జిల్లా మక్తల్‌లో పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
Makthal: మక్తల్‌లో ఘనంగా పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి వేడుకలు!
Makthal: మక్తల్ పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో భారతదేశ తొలి ప్రధానమంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, ఆధునిక భారతదేశ నిర్మాత పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఆల్కూరి రవికుమార్ గారి ఆధ్వర్యంలో మక్తల్ మార్కెట్ ఆవరణలో ఉన్న పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతదేశ నిర్మాణంలో నెహ్రూ గారు చేసిన విశేష కృషి మరువలేనిదని, ముఖ్యంగా విద్యా, శాస్త్ర సాంకేతిక, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి ఆయన వేసిన పునాదులు దేశ ప్రగతికి ఎంతో దోహదపడ్డాయని పేర్కొన్నారు. బాలలపై అమితమైన ప్రేమను చూపిన నెహ్రూ గారి జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకోవడం ఆయనకు మనమిచ్చే గౌరవమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బి. గణేష్ కుమార్, మాజీ ఉపసర్పంచ్ కట్ట సురేష్, కట్టా వెంకటేష్ కౌన్సిలర్లు రహీం పటేల్, మహేష్, శంకర్, డైరెక్టర్లు ఫయాజ్, శ్రీనివాసులు, మహేష్, NSUI జిల్లా అధ్యక్షుడు MD అఫ్రోజ్ , కోఆప్షన్ సభ్యులు శంషుద్దీన్, కల్లూరి గోవర్ధన్, గుంతల రవి, మెకానిక్ రాము, కృష్ణ, క్రాంతి కుమార్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వాకిటి భాస్కర్, ఉపాధ్యక్షులు సురేష్, నాదీర్, నరసింహ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




