Makthal: నేడు మంత్రి వాకిటి శ్రీహరి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ

Makthal: మక్తల్ ద్వారక ఫంక్షన్ హాల్‌లో సోమవారం మంత్రి వాకిటి శ్రీహరి చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు, 671 నూతన చేయూత పింఛన్ల పత్రాల పంపిణీ జరగనుంది.

B. NARENDER, MAKTHAL
Published on: 15 Nov 2026 8:28 PM IST
Makthal
X

Makthal: నేడు మంత్రి వాకిటి శ్రీహరి చేతుల మీదుగా చెక్కుల పంపిణీ

మక్తల్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు గౌరవ శ్రీ వాకిటి శ్రీహరి అన్న గారి సహకారంతో, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మక్తల్ మండలంలోని 39 గ్రామపంచాయతీల కాను లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడనుంది.

మక్తల్ ద్వారక ఫంక్షన్ హాల్ కార్యక్రమంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి అన్న గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది.

మక్తల్ మండలంలోని మొత్తం 27 గ్రామాలకు చెందిన 52 మంది లబ్ధిదారులకు రూ.17,39,000/- (పదిహేడు లక్షల ముప్పై తొమ్మిది వేల రూపాయలు) విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరయ్యాయి.

అనారోగ్యంతో బాధపడుతున్న అన్నదమ్ములకు, అక్కచెల్లెళ్లకు మరియు ఆర్థికంగా వెనుకబడిన పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ, వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తోంది.

తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకం - చేయూత పింఛన్లు

అదేవిధంగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేద, నిరుపేద మరియు బలహీన వర్గాల ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు చేయూత పింఛన్ పథకం ద్వారా నెలవారీ ఆర్థిక సహాయం అందిస్తోంది.

మక్తల్ మండలంలో వివిధ కేటగిరీలకు చెందిన అర్హులైన లబ్ధిదారులకు మొత్తం 671 చేయూత పింఛన్లు అందించబడుతున్నాయి. , వితంతువులు, దివ్యాంగులు మరియు ఇతర అర్హులైన వర్గాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది.

ఈ పథకం ద్వారా కింది వర్గాలకు పింఛన్లు అందించబడుతున్నాయి:

వితంతు పింఛన్లు, దివ్యాంగుల పింఛన్లు, ఒంటరి మహిళల పింఛన్లు, చేనేత కార్మికుల పింఛన్లు, కల్లుగీత కార్మికుల పింఛన్లు, ఫైలేరియా, డయాలసిస్ తదితర ప్రత్యేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి పింఛన్లు, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు, చేయూత పింఛన్ల ద్వారా మక్తల్ మండలంలోని 671 మంది పింఛన్ లబ్ధిదారులకు నెలవారీ ఆర్థిక భరోసా కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ నిబద్ధతకు నిదర్శనం.

కావున, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మరియు చేయూత పింఛన్లు మంజూరైన మక్తల్ మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన లబ్ధిదారులు ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరై, మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి అన్న గారి చేతుల మీదుగా చెక్కులు మరియు నూతన చేయూత పింఛన్ల మంజూరీ పత్రాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL