Makthal: నాలుగు లైన్ల రహదారి కోసం మాజీ ఎమ్మెల్యే చిట్టెం పాదయాత్ర!
Makthal: మక్తల్-నారాయణపేట నాలుగు లైన్ల రహదారి నిర్మాణాన్ని తక్షణమే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు.
Makthal: నాలుగు లైన్ల రహదారి కోసం మాజీ ఎమ్మెల్యే చిట్టెం పాదయాత్ర!
Makthal: మక్తల్–నారాయణపేట నాలుగు లైన్ల రహదారి నిర్మాణానికి రాష్ట్ర మంత్రులు, ముఖ్యమంత్రి పలుమార్లు శంకుస్థాపనలు చేసినప్పటికీ పనులు ముందుకు సాగడం లేదని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.రహదారి నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ నేడు ఉదయం 9 గంటలకు మక్తల్ పట్టణంలోని నారాయణపేట చౌరస్తా నుంచి నారాయణపేట జిల్లా కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టనున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, ఇతర నాయకులు పాల్గొననున్నారు.
మక్తల్ నుంచి నారాయణపేట జిల్లా కేంద్రానికి చేరుకోవడానికి ఈ రహదారి ప్రధాన మార్గంగా ఉంది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి అత్యవసర పరిస్థితుల్లో ప్రమాద బాధితులను తరలించేందుకు కూడా ఇదే రహదారిపై ఆధారపడాల్సి వస్తోంది. అయితే రహదారి గుంతలమయంగా మారడంతో నిత్యం ప్రయాణించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంతల కారణంగా వాహనదారులు అవస్థలు పడటంతో పాటు ప్రయాణ సమయం పెరుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
*ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని నాలుగు లైన్ల రహదారి నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలని, శంకుస్థాపనలకే పరిమితం కాకుండా పనులు ప్రారంభించి పూర్తి చేయాలని పాదయాత్ర ద్వారా ప్రభుత్వాన్ని కోరనున్నారు.




