Makthal: నర్వ మండలంలో అభివృద్ధి పరుగులు.. క్షేత్రస్థాయిలో పరిశీలన!
Makthal: మక్తల్ నియోజకవర్గం నర్వ మండలంలో రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు కొనసాగుతున్న అభివృద్ధి పనులను కాంగ్రెస్ నాయకులు బీసం చెన్నయ్య సాగర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Makthal: నర్వ మండలంలో అభివృద్ధి పరుగులు.. క్షేత్రస్థాయిలో పరిశీలన!
మక్తల్: మక్తల్ నియోజకవర్గం నర్వ మండలంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ శ్రీ వాకిటి శ్రీహరి ఆదేశాల మేరకు..నిరంతర కృషితో నర్వ మండలంలో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో నర్వ మండలంలోని లంకల గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను, మరియు రాయికోడ్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న 33 KV విద్యుత్ సబ్స్టేషన్ పనులను, నర్వ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో సందర్శించి, పనుల పురోగతిని నిశితంగా పరిశీలించారు.
గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చేలా నూతన రహదారుల నిర్మాణం, రైతులకు మరియు ప్రజలకు మెరుగైన విద్యుత్ సౌకర్యాలు కల్పించేలా 33 KV సబ్స్టేషన్ నిర్మాణం చేపట్టడం ఎంతో అభినందనీయనీ నర్వ మండల కాంగ్రెస్ నాయకులు తెలిపారు.
నర్వ మండలంలోని ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్న మన ప్రియతమ నాయకులు, రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ శ్రీ వాకిటి శ్రీహరి గారికి నర్వ మండల ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కాంగ్రెస్ నాయకులు బీసం చెన్నయ్య సాగర్ తెలిపారు. నర్వ మండలంలో అభివృద్ధి ఆగదు, సంక్షేమం ఆగదు, నర్వ మండలం ప్రగతి పథంలో దూసుకుపోతుందనీ కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




