Makthal: మక్తల్ ఆంజనేయ స్వామి ఆలయ రాజగోపురానికి మంత్రి భూమి పూజ!

Makthal: నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో పడమటి ఆంజనేయ స్వామి ఆలయ రాజగోపుర నిర్మాణానికి మంత్రి వాకిటి శ్రీహరి రూ. 50 లక్షల వ్యయంతో శంకుస్థాపన చేశారు.

B. NARENDER, MAKTHAL
Published on: 24 Jun 2026 11:38 AM IST
Makthal
X

Makthal: మక్తల్ ఆంజనేయ స్వామి ఆలయ రాజగోపురానికి మంత్రి భూమి పూజ!

Makthal: మక్తల్ పట్టణంలో 50లక్షల రూపాయల వ్యయం తో నిర్మించతలపెట్టిన పడమటి ఆంజనేయ స్వామి ఆలయ రాజగోపురానికి మంత్రి వాకిటి శ్రీహరి గారు భూమి పూజ చేశారు. మక్తల్ ప్రాంత ప్రజల ఆరాధ్య దైవమైన పడమటి ఆంజనేయ స్వామికి సేవ చేసే అవకాశం దొరకడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి వాకిటి శ్రీహరి గారు తెలియజేశారు.

అత్యంత సుందరంగా ఈ రాజగోపురాన్ని తీర్చిదిద్దనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. రానున్న పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల లోపు గోపురం పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గతంలో పాడు బడ్డ ఆంజనేయ స్వామి కోనేరును కూడా పునరుద్దరించి భక్తులకు అందుబాటులోకి తెచ్చామని మంత్రి వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి తో పాటు మున్సిపల్ ఛైర్ పర్సన్ మానస హన్మంతు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు రవి, నీల గౌడ్,గోవింద రావు, శంకర్, హన్మంతు, లక్ష్మణ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL

Next Story