Narayanpet: మక్తల్‌లో అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల కొరడా.. 3 టిప్పర్ల సీజ్!

Narayanpet: నారాయణపేట జిల్లా మక్తల్‌లో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు.

B. NARENDER, MAKTHAL
Published on: 10 Sept 2026 10:24 PM IST
Narayanpet
X

Narayanpet: మక్తల్‌లో అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల కొరడా.. 3 టిప్పర్ల సీజ్!

నారాయణపేట: మక్తల్ మండల పరిధిలో అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు పోలీసులు చేపడుతున్న ప్రత్యేక తనిఖీల్లో భాగంగా, నేడు మహబూబ్‌నగర్ రోడ్డులోని దండు సమీపంలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 03 ఇసుక టిప్పర్లను టాస్క్ ఫోర్స్, మక్తల్ పోలీసులు పట్టుకున్నారు.

వాహనాల వివరాలు:

టిప్పర్ నంబర్: TG 38 T 3553 ,డ్రైవర్: చెన్నారాయుడు, తండ్రి కృష్ణయ్య, గోపన్‌పల్లి గ్రామం, దేవరకద్ర మండలం. యజమాని: బలవర్ధన్ రెడ్డి, అప్పంపల్లి గ్రామం, మరికల్ మండలం.

టిప్పర్ నంబర్: TS 07 ES 9009 , డ్రైవర్: రాజు, తండ్రి మొగిలన్న, పల్లెగడ్డ గ్రామం, మరికల్ మండలం. యజమాని: లక్ష్మీకాంత్ రెడ్డి, హన్మాన్‌పల్లి గ్రామం, ధన్వాడ మండలం.

టిప్పర్ నంబర్: TG 07 V 9177 , డ్రైవర్: ఆనంద్, తండ్రి హన్మన్న, తిప్రాస్‌పల్లి గ్రామం, ఊట్కూర్ మండలం. యజమాని: లక్ష్మయ్య, మరికల్ గ్రామం, మరికల్ మండలం.

అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్నట్లు గుర్తించిన ఈ మూడు వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకుని, సంబంధిత డ్రైవర్లు మరియు వాహన యజమానులపై కేసులు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ రాజు తెలిపారు.

ఈ సందర్భంగా మక్తల్ ఎస్సై రాజు మాట్లాడుతూ... అక్రమ ఇసుక రవాణాకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను అక్రమంగా తరలించడం, నిల్వ చేయడం లేదా విక్రయించడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. అక్రమ ఇసుక రవాణాపై నిరంతరం నిఘా కొనసాగుతుందని, పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL

Next Story