Makthal: మక్తల్‌లో అక్రమ పేకాట స్థావరంపై దాడి: కేసు నమోదు!
Makthal: మక్తల్ మండలం కర్నె శివారులో అక్రమ పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. రూ.1800 నగదు, 8 బైకులు, 3 ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.
Makthal: మక్తల్‌లో అక్రమ పేకాట స్థావరంపై దాడి: కేసు నమోదు!
మక్తల్: మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధి అయిన కర్నె శివారు లో అక్రమంగా పేకాట నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను నమ్మదగిన సమాచారం మేరకు మక్తల్ పోలీసులు పట్టుకుని వారితో పాటు మరికొంత మందిపై మక్తల్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నంబర్ 448/2026, తెలంగాణ గేమింగ్ యాక్ట్ సెక్షన్ 9(1) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ సందర్భంగా అట్టి స్థలంలో 1800 నగదు, 3 మొబైల్ ఫోన్స్ 8 బైకులు, పేకాట ముక్కలు లభించాయి అని మక్తల్ SI రాజు తెలిపారు. ప్రజలు అక్రమ పేకాట, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని మక్తల్ పోలీసులు హెచ్చరించారు.




