Makthal: జాతీయ స్థాయి అండర్-19 క్రికెట్ పోటీలకు ఊట్కూర్ విద్యార్థి ఎంపిక!

Makthal: నారాయణపేట జిల్లా ఊట్కూర్ విద్యార్థి అఫ్వాన్ SGF జాతీయ స్థాయి అండర్-19 క్రికెట్‌కు ఎంపిక. అభినందించిన మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి.

B. NARENDER, MAKTHAL
Published on: 9 Nov 2026 7:52 AM IST
Makthal
X

Makthal: జాతీయ స్థాయి అండర్-19 క్రికెట్ పోటీలకు ఊట్కూర్ విద్యార్థి ఎంపిక!

Makthal: మక్తల్ నియోజకవర్గం ఊట్కూరు పట్టణానికి చెందిన ప్రతిభావంతుడైన విద్యార్థి మహమ్మద్ అఫ్వాన్ జాతీయ స్థాయి అండర్-19 క్రికెట్ పోటీలకు ఎంపిక కావడంతో ప్రాంతంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే.. మహమ్మద్ అఫ్వాన్ నారాయణపేటలోని క్రికెట్ కోచింగ్ సెంటర్‌లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతూ, తన పట్టుదల, కృషి, అద్భుతమైన ఆటతీరుతో ఈ ఘనత సాధించాడు. స్టేట్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో నిర్వహించే జాతీయ స్థాయి అండర్-19 క్రికెట్ పోటీలకు అఫ్వాన్ ఎంపికయ్యాడు.

ఈ సందర్భంగా మహమ్మద్ అఫ్వాన్ తల్లిదండ్రులు రాష్ట్ర మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి గారిని మర్యాదపూర్వకంగా కలిసి తమ కుమారుడికి జాతీయ స్థాయి క్రికెట్ పోటీల్లో అవకాశం లభించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి శ్రీహరి గారు శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి గారు మహమ్మద్ అఫ్వాన్‌ను అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మక్తల్ వర్గం తో పాటు,నారాయణపేట జిల్లా కు, తెలంగాణ రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో మక్తల్ మున్సిపల్ ఛైర్ పర్సన్ వాకిటి మానస హనుమంతు, అమర్ రెడ్డి సమీవుల్లా కల్వాల్, మక్తల్ నియోజకవర్గం నాయకులు ఆనంద్ గౌడ్, మక్తల్ మండల అధ్యక్షులు శ్రీనివాసులు గౌడ్, చెన్నయ్య గౌడ్, amc డైరెక్టర్ ఫయాజ్ కావలి ఆంజనేయులు, మిస్కిన్ నాగరాజు, గోవర్ధన్, ఓబ్లేష్, నాగేష్, తదితరులు పాల్గొన్నారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL