Makthal: దక్షిణ కొరియాలో విజయ్ భాస్కర్ రెడ్డికి అవార్డు
Makthal: స్టార్ హెల్త్ CEO CLUB లక్ష్యాన్ని సాధించిన మక్తల్‌కు చెందిన విజయ్ భాస్కర్ రెడ్డికి దక్షిణ కొరియా సియోల్‌లో సీఈఓ ఆనంద్ రాయ్ అవార్డు ప్రదానం చేశారు.
Makthal: దక్షిణ కొరియాలో విజయ్ భాస్కర్ రెడ్డికి అవార్డు
మక్తల్: స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతిష్ఠాత్మకమైన CEO CLUB లక్ష్యాన్ని సాధించినందుకు మక్తల్‌కు చెందిన విజయ్ భాస్కర్ రెడ్డికి దక్షిణ కొరియా రాజధాని సియోల్ నగరంలో ఘనంగా అవార్డు ప్రదానం చేశారు.
స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నిర్దేశించిన CEO CLUB అర్హతలో భాగంగా, ఒక సంవత్సరంలో రూ.50 లక్షల ఫ్రెష్ బిజినెస్ సాధించి ఈ అరుదైన గుర్తింపును పొందారు.
దక్షిణ కొరియాలోని సియోల్ నగరంలో నిర్వహించిన కంపెనీ కన్వెన్షన్ కార్యక్రమంలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ CEO & MD శ్రీ ఆనంద్ రాయ్ గారి చేతుల మీదుగా విజయ్ భాస్కర్ రెడ్డి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్నారు.
మక్తల్ ప్రాంతం నుంచి అంతర్జాతీయ వేదికపై ప్రముఖ సంస్థ అధినేత చేతుల మీదుగా అవార్డు అందుకోవడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన విజయానికి సహకరించిన కంపెనీ యాజమాన్యానికి, సహచరులకు, కస్టమర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ విజయంపై మక్తల్ పట్టణ ప్రజలు, మిత్రులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేస్తూ విజయ్ భాస్కర్ రెడ్డికి అభినందనలు తెలియజేస్తున్నారు.




