Nagarkurnool: బండోనిపల్లి గీత కార్మికుడి ఆరోగ్యంపై ఆరా తీసిన నేతలు!
Nagarkurnool: వెల్దండ మండలం బండోనిపల్లికి చెందిన గీత కార్మికుడు జంగయ్య గౌడ్ అడవి పంది దాడిలో గాయపడగా, కల్లుగీత సహకార సంఘం అధ్యక్షులు మట్ట మదన్ గౌడ్ ఆసుపత్రిలో పరామర్శించారు.
Nagarkurnool: బండోనిపల్లి గీత కార్మికుడి ఆరోగ్యంపై ఆరా తీసిన నేతలు!
Nagarkurnool: అడవి పంది దాడిలో గాయపడిన గీత కార్మికుడికి పరామర్శనాగర్ కర్నూల్ జిల్లావెల్దండ మండలం బండోనిపల్లి గ్రామానికి చెందిన గీత కార్మికుడు సత్తూరి జంగయ్య గౌడ్ అడవి పంది దాడిలో గాయపడగా, వెల్దండ కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు మట్ట మదన్ గౌడ్ వెల్దండలోని ఎన్నం ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు.
ఆయన వెంట సంఘం ఉపాధ్యక్షులు మట్ట విష్ణు గౌడ్ ఉన్నారు.ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, ఆయనకు అందుతున్న వైద్య సేవల గురించి వైద్యులతో మాట్లాడారు. జంగయ్య గౌడ్‌కు మెరుగైన వైద్యం అందించి, త్వరగా కోలుకునేలా అవసరమైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు.




