Devarakadra: 3 రోజుల శిక్షణా తరగతులపై ఎంఈఓ కీలక ప్రకటన!

Devarakadra: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర జడ్పీహెచ్ఎస్ బాయ్స్ స్కూల్ లో రేపటి నుండి 46 మంది ఎస్‌జీటీ ఉపాధ్యాయులకు 3 రోజుల ఇన్-సర్వీస్ శిక్షణ ప్రారంభం కానుంది.

GOKARANNA,  GADWAL
Published on: 22 July 2026 8:18 PM IST
Devarakadra
X

Devarakadra: 3 రోజుల శిక్షణా తరగతులపై ఎంఈఓ కీలక ప్రకటన!

దేవరకద్ర: దేవరకద్ర మండలం లోని ప్రాథమిక, ప్రాథమికొన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు రేపటి నుండి మూడు రోజులపాటు జడ్.పి.హెచ్.ఎస్ బాయ్స్ దేవరకద్రలో ఇంటిగ్రేటెడ్ ఇన్ సర్వీస్ టీచర్ ట్రైనింగ్ ఉంటుందని దేవరకద్ర మండల విద్యాధికారి పి .బలరాం తెలియజేశారు.

ఈ మొదటి విడత శిక్షణ కార్యక్రమా నికి 46 మంది ఉపాధ్యాయులు పాల్గొంటారనీ వారు తెలియజేశారు . అందరూ ఉపాధ్యాయులు తప్పకుండా సమయానికి హాజరూ కావాలని వారు తెలియజేశారు. తెలుగు, గణితం, ఆంగ్లం మరియు సాధారణ అంశాలపైన శిక్షణ ఉంటుందని అదేవిధంగా సబ్జెక్ట్ ఆర్పీలుగా కె. శంకర్, శ్రీనివాస్ రెడ్డి, పవన్ కుమార్, నాగరాజు ఉన్నారని మండల విద్యాధికారి ఈ బలరాం తెలియజేశారు.

GOKARANNA,  GADWAL

GOKARANNA, GADWAL

Next Story