Kollapur: కొల్లాపూర్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారం!

Kollapur: కొల్లాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారానికి హాజరైన మంత్రి జూపల్లి కృష్ణారావు, రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

VENKATESWARA CHARY, KOLLAPUR
Published on: 12 Nov 2026 4:41 PM IST
Kollapur
X

Kollapur: కొల్లాపూర్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణస్వీకారం!

Kollapur: కొల్లాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఐదో పాలకవర్గం కొలువుదీరింది. నూతన చైర్‌పర్సన్‌గా పసుపుల షమీమ్, వైస్‌ చైర్మన్‌గా పసుపుల నరసింహతో పాటు నూతన పాలకవర్గ సభ్యులు ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై నూతన చైర్‌పర్సన్, వైస్‌ చైర్మన్, పాలకవర్గ సభ్యులకు శుభాకాంక్షలు,అభినంద‌న‌లు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. “పదవుల వల్ల మనిషికి వన్నె రావడం కాదు.. మనం చేసే మంచి పనులే పదవికి వన్నె తెస్తాయి. ప్రజలకు చేసే సేవ, సమాజానికి మేలు కలిగించే పనులే వ్యక్తికి గౌరవం, గుర్తింపును తీసుకొస్తాయి.

పదవులు తాత్కాలికం ప్రజలకు చేసే సేవ ద్వారా సంపాదించుకునే గౌరవం శాశ్వతం. నూతనంగా బాధ్యతలు చేపట్టిన పాలకవర్గ సభ్యులు పదవులను హోదాగా కాకుండా బాధ్యతగా భావించి, రైతుల సంక్షేమమే ధ్యేయంగా చిత్తశుద్ధితో పనిచేయాలి” అని ఉద్బోధించారు.

కొందరు రాజకీయ నాయకులు ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలను పక్కనపెట్టి బురదజల్లే ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. అలాంటి విమర్శలపై తాను పెద్దగా స్పందించబోనని, వాస్తవాలేమిటో ప్రజలకు తెలుసని స్పష్టం చేశారు. విమర్శలకు సమాధానం చెప్పడం కంటే అభివృద్ధి పనుల ద్వారా ప్రజలకు మేలు చేయడానికే ప్రాధాన్యమిస్తానని పేర్కొన్నారు.

పాలకవర్గ సభ్యులుగా తాడకల జగదీశ్వర్ నాయుడు, పెద్దాపురం శ్రీను, పెద్దిూరి లక్ష్మయ్య, నల్లవెల్లి రామస్వామి, పొనుగోటి పెద్ద కృష్ణారావు, దేశావత్ శ్రీరాములు, మెద్దెల రాందాస్, కందూరి రామచంద్రయ్య, గార్డుల మౌనిక, ఎస్. కృష్ణయ్య, బీఎస్. చాంద్ పాషా ప్రమాణ స్వీకారం చేశారు.

VENKATESWARA CHARY, KOLLAPUR

VENKATESWARA CHARY, KOLLAPUR