Wanaparthy: హరీశ్ రావువి పచ్చి అబద్ధాలు: మంత్రి జూపల్లి ధ్వజం!

Wanaparthy: వనపర్తిలో మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలను మంత్రి జూపల్లి కృష్ణారావు తీవ్రంగా ఖండించారు. పాలమూరు ప్రాజెక్టులపై బీఆర్ఎస్ నేతలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

S.NAGESH, WANAPARTHY
Published on: 3 Nov 2026 8:28 PM IST
Wanaparthy
X

Wanaparthy: హరీశ్ రావువి పచ్చి అబద్ధాలు: మంత్రి జూపల్లి ధ్వజం!

వనపర్తి: జూపల్లి కామెంట్స్ మంత్రి హరీష్ రావు వనపర్తి పర్యటనలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు ఆయన నిరంజన్ రెడ్డి కలిసి చాలా గొప్ప వాస్తవాలు చెప్పారు. నిరంజన్ రెడ్డి గారి ప్రతిష్ట పెంచడానికి హరీశ్ రావు ప్రయత్నాలు చేస్తున్నట్లు ఉంది. ప్రకృతి వైపరీత్యాలను రాజకీయాలుగా వాడుకోవడం వారికే చెల్లుతుంది. హరీష్ రావును సూటిగా ప్రశ్నిస్తున్నా. మీకు తెలియదా కృష్ణా జలాలు కు సంబంధించి జూరాల ప్రాజెక్టు లో ఉన్నది 10tmc లే అని.

జురాల్ నుండి రామన్ పాడు కు పార్లల్ కాలువ నిర్మాణం ఉంది. దాన్ని టెక్నికల్ గా తప్పుగా తవ్వారని దాన్ని సరిచేయమని అప్పట్లోనే మిమ్మల్ని అడిగాను. ఇవన్నీ మీరు అధికారంలో ఉన్నప్పుడే పూర్తి చేసివుంటే ఈరోజు ఈపరిస్తితి వచ్చేదికాడు. 15 TMC ల గూడెం దొడ్డి రిజర్వాయర్ పూర్తి చేసి ఉంటే వేల ఎకరాలు సాగులోకి వచ్చేది. మహాత్మాగాంధీ 4,60,వేల ఎకరాలు కు నీళ్ళు వచ్చేవి.

గూడెం దొడ్డి రిజర్వాయర్ ఎందుకు పూర్తి చేయలేదు. 2012 నుండి కల్వకుర్తి లో 5 మోటార్లు ఉన్నాయి. మరి అప్పుడే ఎందుకు మోటార్లు స్టార్ట్ చేసి నీళ్ళు ఇవ్వలేదు. శ్రీశైలం బ్యాక్ వాటర్ లో మోటార్లు మునిగి కాలిపోయాయి. అదే మీకు తెలియదా. వాటిని స్టార్ట్ చేస్తే మిషన్ భగీరథ కు నీళ్ళు ఇవ్వలేము, రైతుల కష్టాలు తీర్చేందుకే నార్లపూర్ నుండి లక్షల ఎకరాల కోసం నీళ్లు విడుదల చేసాము. మీరంతా పచ్చి అబద్ధాలు ఆడుతూ ప్రజలను తప్పుదారి పాటిస్తున్నారు.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 90శాతం కంప్లీట్ అయిందని హరీష్ రావు చెప్పడం విడ్డూరం. 60 వేల కోట్లు ఖర్చు అయ్యే ప్రాజెక్టును 25 వేల కోట్లు ఖర్చుపెట్టి ఎలా కంప్లీట్ చేసారు. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే 80వేల కోట్లు ఖర్చు అవుతుంది. మరో మూడు నెలల వరకు ఏదులకు నీరు ఇవ్వలేము.

కల్వకుర్తి ద్వారా 1లక్ష ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాము. ఆంధ్రాకు కాంగ్రెస్ నాయకులు నీళ్లు తరలిస్తున్నారని హరీష్ రావు చెప్పడం విడ్డూరం. మీరు అధికారంలో ఉన్నప్పుడే ఆంధ్రాకు తొత్తులుగా మారి నీటిని తరలించారు. 2014-15 .. సంబంధించి 375 TMC ల నీటిని వాడుకున్నాము.

ఉమ్మడి రాష్ట్రంలో కేసీఆర్,హరీష్ కలిసి 511TMC లను ఆంధ్రాకు అప్పజెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ఈరోజు పాలమూరు ప్రజలకు అన్యాయం జరిగింది. ఇప్పటికే కరువు మండలాలను గుర్తించి. ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది.

S.NAGESH, WANAPARTHY

S.NAGESH, WANAPARTHY