Alampur: అలంపూర్‌లో రూ. 4.60 కోట్లతో సౌండ్ అండ్ లైట్ షో ప్రారంభించిన కిషన్ రెడ్డి
Alampur: ప్రసాద్ పథకంలో భాగంగా అలంపూర్ జోగులాంబ క్షేత్రంలో రూ. 4.60 కోట్లతో ఏర్పాటు చేసిన మల్టీమీడియా, సౌండ్ అండ్ లైట్ షోను ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
Alampur: అలంపూర్‌లో రూ. 4.60 కోట్లతో సౌండ్ అండ్ లైట్ షో ప్రారంభించిన కిషన్ రెడ్డి
Alampur: ఆలంపూర్ ఆలయ విశిష్టత తెలిపేలా సౌండ్, లైట్స్ షో ప్రారంభించిన కేంద్ర బొగ్గు, గనుల శాఖల మంత్రి కిషన్ రెడ్డి.దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన అలంపూర్ క్షేత్ర ఆధ్యాత్మిక, చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని వెలుగు ధ్వనుల సమ్మేళనంతో ఆవిష్కరించే మల్టీమీడియా, సౌండ్, లైట్ షోను రూ.4.60 కోట్ల నిధులతో కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రసాద్ పథకంలో భాగంగా ఏర్పాటు చేయడంతో కేంద్ర బొగ్గు, గనుల శాఖల మంత్రి కిషన్ రెడ్డి ఆదివారం సాయంత్రం ఆలంపూర్ లోని ఆలయ ప్రాంగణం వద్ద ప్రారంభించారు.
ఆలంపూర్ కు చేరుకున్న మంత్రికి పలువురు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సౌండ్స్ లైట్ షో కార్యాలయంను కేంద్ర మంత్రి ఇతర అతిధులతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం మల్టీమీడియా సౌండ్ లైట్ షోను మంత్రి అతిధులు, ప్రజలతో కలిసి తిలకించారు. అంతకుముందు ఒగ్గు కళాకారులు అలంపూర్ ఆలయ విశిష్టతపై ప్రదర్శించిన ఒగ్గు కథ ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ లోక్ సభ సభ్యులు మల్లు రవి, డీకే అరుణ, ఆలంపూర్ శాసనసభ్యులు విజేయుడు, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్, యూత్ అడ్వాన్స్ మెంట్ టూరిజం అండ్ కల్చర్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వాణి ప్రసాద్, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి గౌతమి, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు.