Makthal: రామ్లీలా మైదానంలో దసరా వేడుకల్లో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి!
Makthal: మక్తల్ రామ్లీలా మైదానంలో దసరా వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొని నల్ల జానమ్మ అమ్మవారికి పూజలు, రావణ దహనం నిర్వహించిన మంత్రి వాకిటి శ్రీహరి.
Makthal: రామ్లీలా మైదానంలో దసరా వేడుకల్లో పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి!
Makthal: మక్తల్ పట్టణంలోని రామ్లీలా మైదానంలో నిర్వహించిన దసరా వేడుకల్లో మంత్రి వాకిటి శ్రీహరి కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన ప్రార్థించారు. అనంతరం రామ్లీలా మైదానంలో నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పండుగ ప్రజల్లో ధర్మం, సత్యం, ఐక్యతా భావాలను పెంపొందిస్తుందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. మక్తల్ పట్టణంలో పండుగ వేడుకలు ఉత్సాహభరిత వాతావరణంలో జరగడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.




