Makthal: మక్తల్‌లో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం.. హాజరైన మంత్రి సతీమణి లలిత!

Makthal: మక్తల్ మండలం వనాయికుంటలో నిర్వహించిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి లలిత హాజరయ్యారు.

B. NARENDER, MAKTHAL
Published on: 25 Oct 2026 1:31 PM IST
Makthal
X

Makthal: మక్తల్‌లో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం.. హాజరైన మంత్రి సతీమణి లలిత!

Makthal: ఇందిరమ్మ గృహప్రవేశం హాజరైన మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి మక్తల్ మండలం వనాయి కుంట గ్రామం లో సందనోళ్ల నారాయణమ్మ,సందప్పల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం. కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీహరి సతీమణి వాకిటి లలిత గారు హాజరయ్యారు.ఈ సందర్బంగా మంత్రి సతీమణి లలితమ్మ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం గుడిసెలు లేని రాష్ట్రం కావాలి అనే సంకల్పంతో ఇందిరమ్మ ఇండ్లను ఏర్పాటు కు శ్రీ కారం చుట్టిందని అందుకు గాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షలు రూపాయలను ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సహాయపడుతుందని వాకిటి లలిత తెలిపారు.

ప్రతి ఒక్క ఇందిరమ్మ లబ్ధిదారుల కుటుంబం సొంతం గా పక్క ఇందిరమ్మ ఇండ్లను వెంటనే పూర్తి చేసుకోవాలని ఆమె ఆకాంక్షిచారు. ఈ సందర్బంగా ఇందిరమ్మ గృహప్రవేశంనకు హాజరై వారికి వాకిటి వారి కానుకను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వాకిటి మానస హన్మంతు, మక్తల్ టౌన్ అధ్యక్షులు రవి కుమార్,వాకిటి భాస్కర్ యూత్ కాంగ్రెస్ నాయకులు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

B. NARENDER, MAKTHAL

B. NARENDER, MAKTHAL