Devarakadra: ముచ్చింతలలో మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే!
Devarakadra: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండలం ముచ్చింతలలో గుండెపోటుతో మృతి చెందిన యాదయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి.
Devarakadra: ముచ్చింతలలో మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే!
Devarakadra: కౌకుంట్ల మండలం ముచ్చింతల గ్రామంలో ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన కావలి యాదయ్య కుటుంబాన్ని ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పరామర్శించారు.
యాదయ్య కుటుంబ సభ్యులను ఓదార్చి, వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
అనంతరం సుక్కన్ రెడ్డి సతీమణి కీర్తిశేషులు జ్యోతి దశదిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జి .మధుసూదన్ రెడ్డి పాల్గొని, జ్యోతి చిత్రపటానికి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమం లో గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి,కురుమూర్తి దేవస్థానం మాజీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ తిరుపతిరెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




