Mahabubnagar: చిన్నచింతకుంట పాఠశాలలో బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే!
Mahabubnagar: దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంటలో పైలట్ ప్రాజెక్ట్‌గా బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభం. విద్యార్థులతో కలిసి అల్పాహారం తిన్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.
Mahabubnagar: చిన్నచింతకుంట పాఠశాలలో బ్రేక్ ఫాస్ట్ పథకం ప్రారంభించిన ఎమ్మెల్యే!
Mahabubnagar: దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం రోజు పైలెట్ ప్రాజెక్టు కింద బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించి విద్యార్థులతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసిన ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి.
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు కొందరు ఇంటి దగ్గరే అన్నం తిని వస్తున్నారు . మరికొందరు ఖాళీ కడుపుతో పాఠశాలకు వస్తున్నారు. ఆకలితో ఉన్న విద్యార్థులు చదువుపై దృష్టిని సారించలేరని ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి పేద విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఏ ఒక్కరు కూడా కాళీ కడుపుతో పాఠశాలకు రాకూడదనే ఉద్దేశంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమిక పాఠశాల విద్యార్థుల నుంచి జూనియర్ కాలేజ్ విద్యార్థుల వరకు బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని డిసెంబర్ 9వ తేదీన సోనియాగాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రారంభించనున్నారు.
ఈ రోజు పైలట్ ప్రాజెక్టు కింద చిన్నచింతకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించి విద్యార్థులతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు.
దానిలో భాగంగానే విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నారు. కావున విద్యార్థులందరూ మంచిగా చదువుకుని ఉన్నత స్థానాలలో ఉండాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




