Devarakadra: కోయిల్ సాగర్ పాఠశాలలో ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభం!
Devarakadra: మహబూబ్నగర్ జిల్లా కోయిల్ సాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభించారు.
Devarakadra: కోయిల్ సాగర్ పాఠశాలలో ఆర్వో వాటర్ ప్లాంట్ ప్రారంభం!
మహబూబ్నగర్ జిల్లా: దేవరకద్ర మండలం కోయిల్ సాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం రోజు స్థానిక ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి ఆర్వో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన ప్రజా ప్రభుత్వం ముఖ్యంగా విద్యార్థులకు ఎలాంటి లోటు లేకుండా చదువు సాగాలనే ఉద్దేశంతో ప్రతి విద్యార్థికి కూడా అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందిస్తుందని తెలిపారు.
కనుక విద్యార్థులందరూ మంచిగా చదువుకొని ఉన్నత స్థానాలను అందుకోవాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్, ఉపాధ్యాయులు అనంత రెడ్డి, స్వరూప రాణి, సుదర్శన్, కనకప్ప, అనురాధ విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




