Devarakadra: జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి

Devarakadra: దేవరకద్ర మండల జనరల్ బాడీ సమావేశంలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొని అన్ని ప్రభుత్వ శాఖల పనితీరుపై సమీక్షించారు.

GOKARANNA,  GADWAL
Published on: 5 Aug 2026 8:08 PM IST
Devarakadra
X

Devarakadra: జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి

దేవరకద్ర: ఈ సందర్భంగా రెవెన్యూ, వ్యవసాయం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఉపాధి హామీ, విద్య, వైద్య ఆరోగ్యం, విద్యుత్, హౌసింగ్, మిషన్ భగీరథ, గ్రామీణ నీటి సరఫరా, పశుసంవర్ధక, ఆర్‌అండ్‌బీ, ఉద్యానవన, ఇరిగేషన్, ఫారెస్ట్, వెటర్నరీ తదితర శాఖల అధికారులు తమ శాఖల పురోగతిని ఎమ్మెల్యే కి వివరించారు.

అనంతరం ఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ... ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యానికి తావు లేకుండా జవాబుదారీతనంతో పనిచేయాలని ఆదేశించారు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో సర్పంచులతో సమన్వయం పెంచి గ్రామస్థాయిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడటంతో అడ్మిషన్లు పెరిగాయని పేర్కొంటూ విద్యా రంగంపై ప్రత్యేక శ్రద్ధ కొనసాగుతుందని తెలిపారు. ఉపాధి హామీ పథకం కింద కొత్త పనులపై సర్పంచులకు అవగాహన కల్పించి, ప్రతి గ్రామంలో అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టాలని సూచించారు, నీటి సంరక్షణ, చెరువుల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు, రాబోయే సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని అవసరమైన మందులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.

రైతులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించడంతో పాటు త్వరలో ట్రాన్స్‌ఫార్మర్లు, ఏబీ స్విచ్‌లు, విద్యుత్ పోల్స్ పంపిణీ కార్యక్రమాలను త్వరలో మండలాల వారీగా చేపడతామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, ప్రతి గ్రామంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా నిరంతర నీటి సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందుబాటులో ఉండేలా వ్యవసాయ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని, పశువైద్య సేవలను గ్రామస్థాయిలో మరింత సమర్థవంతంగా అందించాలని చెప్పారు.

గ్రామాలు, మండల కేంద్రాల్లో పరిశుభ్రత, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రోడ్లు, భవనాల నిర్మాణ పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించి రైతులకు అవగాహన కల్పించాలని హార్టికల్చర్ శాఖ అధికారులకు సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలను వెంటనే అందజేయాలని ఈ సందర్భంగా సర్పంచులను ఆదేశించారు.

ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

GOKARANNA,  GADWAL

GOKARANNA, GADWAL

Next Story