Devarkadra: కురుమూర్తి స్వామి తొలి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్!
Devarkadra: దేవరకద్ర ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల తొలి పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
Devarkadra: కురుమూర్తి స్వామి తొలి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్!
Devarkadra: దేవరకద్ర నియోజకవర్గం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశ్రీశ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి అలంకారం సందర్భంగా నిర్వహించిన తొలి పూజ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సతీసమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సంస్థానాధీశులు శ్రీరామ్ భూపాల్ , పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
అనంతరం జాతర మైదానంలో భక్తుల సౌకర్యార్థం చేపట్టిన ఏర్పాట్లను ఎమ్మెల్యే జియంఆర్ స్వయంగా పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, పారిశుధ్యం, రాకపోకలు, భద్రత తదితర అంశాలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
భక్తుల విశ్వాసానికి పెద్దపీట వేస్తూ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. శ్రీ కురుమూర్తి స్వామి వారి ఆశీస్సులు దేవరకద్ర నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.




