Mahabubnagar: కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే జియంఆర్ సమీక్ష!

Mahabubnagar: దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA
Published on: 6 Nov 2026 9:18 PM IST
Mahabubnagar
X

Mahabubnagar: కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే జియంఆర్ సమీక్ష!

Mahabubnagar: కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష, దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ తదితర అధికారులతో కలిసి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ.

అనంతరం వివిధ శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో పాల్గొని బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్షించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జియంఆర్ మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ముఖ్యంగా నవంబర్ 14న జరిగే స్వామివారి అలంకారోత్సవం, నవంబర్ 16న జరిగే ఉద్దాల మహోత్సవానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున, అందుకు అనుగుణంగా ఏర్పాట్లును వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జియంఆర్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో, బాధ్యతాయుతంగా పనిచేసి శ్రీ.శ్రీ.శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అన్ని శాఖల అధికారులు, ఆలయ చైర్మన్, కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

K. RAGUVEER KUMAR, DEVARAKADRA

K. RAGUVEER KUMAR, DEVARAKADRA